రవితేజని అమితంగా ఇష్టపడే నిఖిల్ ఆమధ్య అతడిని విపరీతంగా ఇమిటేట్ చేస్తుండేవాడు. కళావర్ కింగ్, వీడుతేడా వగైరా సినిమాలతో ‘పూర్ మాన్స్ రవితేజ’ అని కూడా పేరు తెచ్చేసుకున్నాడు. మూస సినిమాలతో, ఒకే రకం నటనతో ఇరిటేట్ చేసిన నిఖిల్ ఆ తర్వాత కరెక్ట్ ప్రాజెక్ట్స్ ఓకే చేసాడు.
స్వామిరారా తన కెరీర్ టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అంది పుచ్చుకున్న నిఖిల్ స్వామిరారా తర్వాత జాగ్రత్త పడ్డాడు. తను ఎలాంటి సినిమాలు చేయాలో రియలైజ్ అయ్యాడు. కథకి ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ, హీరోయిజం జోలికి పోకుండా కథలో పాత్రగా కనిపించడానికి సిద్ధమయ్యాడు.
ఈ థాట్ ప్రాసెస్‌తో నిఖిల్ రైట్ ట్రాక్ ఎక్కేసాడు. స్వామిరారా తర్వాత కార్తికేయ చిత్రంతోను ఇంప్రెస్ చేసిన నిఖిల్ ఇప్పుడు తనకి తానే హై స్టాండర్డ్స్ సెట్ చేసుకున్నాడు. అతను ఓకే చేసిన కథ అంటే ఖచ్చితంగా బాగుంటుందనే కాన్ఫిడెన్స్ కలిగించాడు. ఇది బిల్డ్ చేసుకోవడానికి చాలా కష్టపడిన నిఖిల్ ఇప్పుడిదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ముందుకి సాగాలి.