మహేష్ బాబు అభిమానులు కలవరపడుతున్నారు. ఆగడు లాంటి అట్టర్ ఫ్లాప్ తరువాత తమ హీరో చేస్తున్న సినిమాపై వారికి బోలెడు ఆశలు వుండడం సహజం.కానీ తెలుగు సినిమాకు సెంటిమెంట్లు ఎక్కువ. ఇప్పుడా సెంటిమెంట్లు మహేష్ సినిమాను వెన్నాడుతున్నాయి.,
అందులో ఒకటి దర్శకుడు కొరటాల శివకు ఇది రెండో సినిమా. తెలుగు దర్శకుల్లో ఒకరిద్దరు మినహా ద్వితీయ విఘ్నాన్ని గట్కెక్కిన వారు లేరు. అదో భయం. దాన్ని మించిన భయం మరొకటి వుందట.
అది ఒకప్పటి హీరో రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్ర ధరించడం. రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత జులాయి మినహా హిట్ అయిన సినిమా లేదు. పైగా అన్నీ డిజాస్టర్లే. పైగా ఆగడులో కూడా రాజేంద్రుడు వున్నాడు.
బావ, మొగుడు ఇలా డిజాస్టర్ల జాబితా పెద్దదే వుంది. అదే ఇప్పడు మహేష్ అభిమానులను కలవర పెడుతోందట. అయినా మన హీరో టైమ్ బాగుంటే, ఇలాంటివి ఏం చేస్తాయి.