విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' ముందు ఓకే చేసిన కథల్లో 'డియర్ కామ్రేడ్' ఒకటి. విజయ్ పొటెన్షియల్ ఎంత అనేది తెలిసిన తర్వాత 'డియర్ కామ్రేడ్' లెక్కలు మారాయి. అప్పట్నుంచి కథకి అనేక మార్పు చేర్పులు చేస్తూ వచ్చారు. గత యేడాదిలోనే పూర్తి కావాల్సిన చిత్రం మధ్యలో కొన్నాళ్లు ఆగిపోయి మళ్లీ మొదలయింది. మే 31న వస్తుందని ప్రకటించారు కానీ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసారు.
ముందుగా అనుకున్న వర్క్ అయితే ఆల్రెడీ పూర్తయిందట. కానీ రఫ్ కట్ చూసుకున్నాక రిపేర్ వర్క్ మొదలు పెట్టారట. ఆ వర్కే ఇంకా తెమలలేదని, ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే వుందని సమాచారం. జులై 26న విడుదల తేదీ అయితే ప్రకటించారు కానీ షూటింగ్ మాత్రం ఇంకా బ్యాలెన్స్ వుండడంతో రిలీజ్ డేట్ మారుతుందా అనే డౌట్స్ వస్తున్నాయి కానీ ఈ డిలే ఊహించడం వలనే ముందుగా అనుకున్న దానికి రెండు నెలల గ్యాప్ ఇచ్చారట.
సినిమా పట్ల ఆసక్తి పెంచడానికి విడుదల చేసిన టీజర్ బాగానే వర్కవుట్ అయింది. అలాగే ఇంతవరకు విడుదల చేసిన రెండు పాటలు కూడా క్లిక్ అయ్యాయి. ఈ చిత్రాన్ని సెకండ్ పార్టీ వాళ్లకి అర్జున్‌రెడ్డి బిజినెస్ రేంజ్‌కి తగ్గట్టు అమ్మినా కానీ థర్డ్ పార్టీల వాళ్లు మాత్రం 'గీత గోవిందం' వసూలు చేసిన దానికి అనుగుణంగా రేట్లు మాట్లాడుతున్నారని తెలిసింది.