చినబాబు కామెడీ అస్సలు ఆగట్లేదుగా!

విజయవాడలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగింది. ఎందుకు ఓడిపోయాం, ఇప్పుడేం చేయాలి అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చల్లో కాస్త ఘాటు వాస్తవాలే బైటపడ్డాయని, తమ్ముళ్లంతా తమ బాధను ధైర్యంగానే బాబు…

విజయవాడలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరిగింది. ఎందుకు ఓడిపోయాం, ఇప్పుడేం చేయాలి అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చల్లో కాస్త ఘాటు వాస్తవాలే బైటపడ్డాయని, తమ్ముళ్లంతా తమ బాధను ధైర్యంగానే బాబు దగ్గర వ్యక్తపరిచారని సమాచారం. అయితే చినబాబు మాత్రం యథావిధిగా అక్కడ కూడా కామెడీ చేసి వెళ్లారు.

మీటింగ్ సమయంలో ఏ కన్వెన్షన్ సెంటర్ కు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు లోకేష్. ఓవైపు సీరియస్ గా మీటింగ్ జరుగుతున్నా కూడా అవేవీ పట్టనట్టే లోకేష్ తన లోకంలో మునిగిపోయారు. ఇది చూసిన టీడీపీ సీనియర్ నేతలు సైతం నవ్వుకున్నారు. ఇలాంటి కొడుకునా చంద్రబాబు సీఎం చేయాలనుకుంది అని మనసులో మథనపడ్డారు.

ఓవైపు ట్విట్టర్ పోస్టింగులతో కామెడీ చేస్తున్న లోకేష్.. మరోవైపు ఇలా తన ప్రవర్తనతో మరింతగా నవ్వులపాలవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేయాల్సిన పనులన్నీ.. ఓడిపోయాక చేస్తూ.. కాలం గడుపుతున్నారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండాల్సిన ఈ టైమ్ లో ఇలా తనకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు చినబాబు.

నిజానికి పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది లోకేష్ అసెంబ్లీలో అడుగుపెడితే బాగుండేదని అనుకున్నారు. ప్రచారంలో తన మాటలతో మాంచి ఫన్ జనరేట్ చేసే లోకేష్.. శాసనసభలో వైరిపక్షాల దాడి ఎలా ఎదుర్కుంటారో చూడాలనే ఆశ కొంతమందిలో ఉంది. లోకేష్ ప్రతిపక్ష పార్టీ తరపున అసెంబ్లీలో అడుగుపెడితే మంచి కామెడీ పండుతుందని ఆశించారు. అయితే ఆ ఆశలు నెరవేరలేదు. సైలెంట్ గా ఉండే శాసన మండలికే చినబాబు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే తన అభిమానులు నిరాశ పడాల్సిన పనిలేదంటూ.. ఇలా సెల్ఫీలతో సందడి చేశారు చినబాబు. పార్టీ పరిస్థితి ఏంటా అని బాబు దిగులు పడుతుంటే.. చీకూ చింతా లేకుండా ఇలా ఫొటోలు దిగుతూ చినబాబు పార్టీని పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. 

ఓటమిపాలైనా తుదిశ్వాస దాకా రాజకీయాల్లోనే – పవన్