పూరి-మెగాస్టార్ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు రామ్ చరణ్ నిర్మాత. ఇదేమీ కొత్త విషయం కాదు. డాడీ 150 వ సినిమాను తానే నిర్మిస్తానని చరణ్ ఎప్పుడో ప్రకటించాడు. అయితే ఈ సంగతి తెలిసి కూడా కొందరు ప్రముఖ నిర్మాతలు ఈ సినిమా తమకు ఇమ్మని చరణ్ ను పదేపదే అప్రోచ్ అయినట్లు తెలిసింది.
అయితే చిరంజీవి, చరణ్ ఇద్దరూ కూడా వారిని చాలా పొలైట్ గా వారించారట. చాన్నాళ్ల తరువాత మెగాస్టార్ సినిమా చేస్తున్నారు. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దాంట్లో డవుట్ లేదు. కానీ సబ్జెక్ట్, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ కలిసి రావాలి. తేడా వస్తే కనీసం పాతిక ముఫై కోట్ల వ్యవహారం.
అందుకనే ఈ సినిమాకు మాత్రం తమ స్వంత డబ్బులే పెట్టాలని తండ్రీ కొడుకులు చిరు-చరణ్ డిసైడ్ అయ్యారట. నిర్మాతలకు అదే చెప్పారట. కావాలంటే 151 వ సినిమా చేసుకోండి..తప్పకుండా ఇద్దాం. ఈ సినిమా మాత్రం లాభమైనా,నష్టమైనా మేమే చూసుకుంటాం అని చెప్పారుట.
మన చేతికి మట్టి అంటకుండా పని కానిద్దాం అనుకునే వారే టాలీవుడ్ లో ఎక్కువ. ఈ విషయంలో చరణ్-చిరు లను అభినందించాల్సిందే.