మహేష్ బాబు, అల్లు అర్జున్ కలిసి రోబో 2.0 ను బలవంతంగా వెనక్కునెట్టారు. సమ్మర్ లో ఆంధ్ర, సీడెడ్ ల్లో దాదాపు అన్ని థియేటర్లను ముందుగా అగ్రిమెంట్లు చేసేసారు. నైజాంలో దొరికినకాడికి బ్లాక్ చేసారు.
దీంతో ఆంధ్రలో రోబో 2.0 సమ్మర్ విడుదల అన్నది సమస్యగా మారింది. అల్లు అర్జున్ సినిమా వుండడంతో అల్లు అరవింద్ రంగంలోకి దిగారు. యువి, దిల్ రాజు, ఎన్వీప్రసాద్, ఇలా దాదాపు ఆంధ్ర సీడెడ్ లోని అన్ని గ్రూపులతో మాట్లాడి థియేటర్లు సెట్ చేసి వుంచేసారు.
ఇక రోబో 2.0 వాయిదా వేయక తప్పదని వార్తలు వినవస్తున్నాయి. మార్చిలో రామ్ చరణ్, ఏప్రియల్ అల్లు అర్జున్, సినిమా ఫిక్స్ డ్ గా వస్తున్నాయి.
మహేష్ బాబు తన భరత్ అనే నేను సినిమాను ఏప్రియల్ లో అనుకున్న తేదీ కన్నా ఓ వారం ముందుగా కానీ, లేదా జూన్ లో కానీ విడుదల చేసే అవకాశం వున్నట్లు వార్తలు అందుతున్నాయి. మే నెలను మహేష్ సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. జూన్ లో విడుదల అనుకుంటే, రోబో 2.0 ఏప్రియల్ బదులు జూన్ లో వస్తుందని టాక్.
అందువల్ల ఓ వారం ముందుగానే భరత్ అనే నేను వస్తుందా అన్నది అనుమానం. స్పైడర్ సమస్యలాగే వుంది భరత్ అనే నేనుకు కూడా. సరైన డేట్ దొరక్క అటు ఇటు జరిగి, ఎప్పుడో ఒకప్పుడు రావడం. ఈసారి అయినా స్టడీగా మంచి డేట్ న రావడం అవసరం. ఏం చేస్తారో చూడాలి?