Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రొమాన్స్‌ ఓకే.. ఫ్లేవర్‌ చెడిందా.?

రొమాన్స్‌ ఓకే.. ఫ్లేవర్‌ చెడిందా.?

'ఓకే జాను' సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. కారణం ఆ సినిమాలోని 'రొమాంటిక్‌ సీన్స్‌' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఈ తరహా సినిమాలకి ఇదో పెద్ద అడ్వాంటేజ్‌. సన్నీలియోన్‌ నటించే చాలా సినిమాలు ప్రీ రిలీజ్‌ హైప్‌ పొందుతాయంటే, దానికి కారణం ఆయా సినిమాల ప్రోమోస్‌ సినిమా విడుదలకు ముందే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ, సినిమాపై ఉత్కంఠ రేపేస్తుంటాయి. 

మరీ, సన్నీలియోన్‌ సినిమాలతో పోల్చేయడం ఎంతవరకు సబబు.? అన్న విషయం పక్కన పెడితే, అంతకు ఏమాత్రం తగ్గడంలేదు 'రొమాంటిక్‌' మూవీస్‌. రొమాన్స్‌ పేరుతో నానా రచ్చా చేసేస్తోన్న బాలీవుడ్‌ సినిమాల్లో 'ఓకే జాను' కూడా ఒకటి. మొన్న ట్రైలర్‌, తాజాగా సాంగ్‌ ప్రోమో.. ఇంటర్నెట్‌లో హీటెక్కించేస్తున్నాయంతే. 

'బొంబాయి' సినిమాలోని 'హమ్మ.. హమ్మ..' సాంగ్‌ గుర్తుందా.? మర్చిపోయే సాంగ్‌ కాదది. దాన్ని 'ఓకే జాను' కోసం రీమిక్స్‌ చేసేశారు. రొమాన్స్‌ వరకూ చూస్తే, ఒరిజినల్‌ సాంగ్‌కీ, దీనికీ పొంతనేమీ లేదు. ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు 'ఓకే జాను'లోని పాటలో ఆదిత్య రాయ్‌ కపూర్‌, శ్రద్ధాకపూర్‌. కానీ, ఒరిజినల్‌ ఫ్లేవర్‌ మాత్రం దెబ్బతినేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'బొంబాయి' మేకర్‌ మణిరత్నం, 'ఓకే జాను'కి సహ నిర్మాత.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?