Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్-ఆర్-ఆర్.. రామ్ చరణ్ నుంచి మొదలు

ఆర్-ఆర్-ఆర్.. రామ్ చరణ్ నుంచి మొదలు

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ లుక్స్ విడుదల చేసే ప్రక్రియ షురూ అయింది. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న రాజమౌళి తనయుడు కార్తికేయ, షార్ట్ గ్యాప్ తర్వాత తిరిగి మళ్లీ పనిలో పడ్డాడు. ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ లుక్స్ బాధ్యతను ఇతడే తీసుకున్నాడట. ఇందులో భాగంగా తొలి ఫస్ట్ లుక్ రామ్ చరణ్ ది రాబోతోంది.

వచ్చేనెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంది. ఆ టైమ్ కు ఫస్ట్ లుక్ రెడీ చేయాలనేది టార్గెట్. కేవలం ఓ స్టిల్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటారా లేక బాహుబలి టైపులో ఓ థీమ్ క్రియేట్ చేసి వీడియో విడుదల చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

బాహుబలి ప్రాజెక్టుకు సంబంధించి లుక్స్ వ్యవహారాలన్నీ కార్తికేయ చూసుకున్నాడు. ప్రత్యేకంగా ఓ థీమ్ ను సెలక్ట్ చేసి, దాన్ని ఆన్ లైన్ లో కొనుగోలు చేసి మరీ వరుసగా నటీనటుల క్యారెక్టర్స్ తో లుక్స్ విడుదల చేశారు. సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీని ఆర్-ఆర్-ఆర్ కు కూడా పాటించాలని భావిస్తున్నారు.

ఫస్ట్ లుక్స్ పై ఓ అవగాహనకు వచ్చినప్పటికీ సినిమా టైటిల్, హీరోయిన్స్ విషయంపై మాత్రం యూనిట్ ఎలాంటి లీకులు ఇవ్వడంలేదు. ఈ ప్రాజెక్టులోకి బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఎంట్రీ దాదాపు పక్కా అయింది. ఆ మేటర్ తో పాటు మూవీ టైటిల్ ను దశలవారీగా గ్రాండ్ గా ఎనౌన్స్ చేయాలని యూనిట్ భావిస్తోంది.

నా నోరు మూయించాలని చూశారు : వీరమాచినేని

పబ్లిక్ పల్స్ : ఆ నియోజకవర్గంలో జనసేనపై ఏమనుకుంటున్నారు..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?