Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ ఆర్ ఆర్ ఇక 2021నే

ఆర్ ఆర్ ఆర్ ఇక 2021నే

ఆర్ ఆర్ ఆర్. తెలుగులో రాబోతున్న హెవీ బడ్జెట్ మూవీ. ప్రస్తుతానికి ఈ రేంజ్ లో నిర్మాణంలో వున్న సినిమా ఇదొక్కటే. సాహో, సైరా వచ్చేసాయి. మిగిలింది ఇదే. ఈ సినిమాను 2020 సమ్మర్ కు కాస్త అటుగా విడుదల చేస్తామని యూనిట్ ముందే ప్రకటించింది. అయితే ఇప్పుడు వినవస్తున్న వార్తల ప్రకారం అలా జరగడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా 2020లో రావడం లేదని, 2021 విడుదల అని తెలుస్తోంది.

ఇలాంటి గ్యాసిప్ వినపడడానికి రెండు కారణాలు. ఒకటి ఆర్ఆర్ఆర్ వర్క్ దాదాపు జూలై వరకు వుండడం. సినిమా పూర్తయ్యేసరికి సమ్మర్ దాటిపోతుంది. దసరా సీజన్ ఈ సినిమాకు సరిపోతుందా? అన్నది మరో డౌట్. ఇటీవల దసరా ముందు, వెనుక మూడు భారీ సినిమాలు విడుదలయ్యాయి.

వార్, సాహో, సైరా సినిమాల ఫలితం చూసిన తరువాత సమ్మర్ మాత్రమే పెద్ద సినిమాలకు సరైన సీజన్ అన్న భావన ఆర్ఆర్ఆర్ సృష్టికర్త రాజమౌళిలో కలిగిందని బోగట్టా. లేదా మరీ కాస్త ధైర్యం చేస్తే సంక్రాంతి. అంటే 2021 జూలై నుంచి డిసెంబర్ లోపు అవకాశం లేనట్లే అనుకోవాలి.

రాజమౌళి అండ్ టీమ్ తెగించి, 2021 దసరాకు వదిలేద్దాం అనుకుంటే తప్ప, ఆర్ఆర్ఆర్ 2020లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?