బ్రిటిష్ నాటి కథాకాలంతో, గుర్రాలు, ఆనాటి మోటార్ కార్లు, బైకులు, పట్నం పల్లెల నేఫథ్యంలో కథ తయారవుతోంది రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమాకు. అయితే స్క్రిప్ట్ డిస్కషన్లు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ముఖ్యంగా రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్ల మీద గట్టి కసరత్తు జరుగుతోందట. సైరా మాదిరిగానే స్వాతంత్ర్య పోరాట వాసనలు ఈ కథలో వుంటాయని తెలుస్తోంది.
కొమరమ్ భీమ్ మాదిరిగా ఓ మాంచి పవర్ ఫుల్ పాత్ర కూడా వుంటుందని వినికిడి. అందుకే కథ మీద కాస్త గట్టి కసరత్తే చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. ఈ డిస్కషన్లలో కాస్త విషయం వుందని అనిపించిన తన సహాయకులు చాలా మందిని రాజమౌళి ఇన్ వాల్వ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరంభంలో 1980ల నాటి కథాకాలం అని వినవచ్చినా, 1947 నాటి కథ అని ఇప్పడు మొత్తానికి పక్కాగా బయటకు వచ్చింది.
అందువల్ల సెట్ లు, గ్రాఫిక్స్, స్టోరీ బోర్డ్ హంగామా మళ్లీ ఓ రేంజ్ లో వుంటుంది. అందువల్ల నిర్మాణ వ్యయం కూడా మళ్లీ అదే రేంజ్ లో వుంటుందని తెలుస్తోంది.