Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టార్ ఆదుకుంటారా?

మెగాస్టార్ ఆదుకుంటారా?

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ ధేవ్ తో మంచి ప్రయత్నమే చేసారు నిర్మాత సాయి కొర్రపాటి. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఎమోషన్లతో మంచి కథే అల్లుకున్నారు. కానీ జనాలకు ఎక్కలేదు. దానికి చాలా కారణాలు వుండొచ్చు. అన్నింటికన్నా కీలకమైనది మెగాఅల్లుడు కళ్యాణ్ ధేవ్ హీరో కావడం కూడా అని జనాల టాక్. అతగాడు ఆ సినిమాకు మిస్ కాస్టింగ్ అన్న టాక్ వచ్చింది. అతను ఏ మేరకు నటించగలడో అంత మేరకే సీన్లు రాసుకున్నారు. డ్యూయట్లు, కాస్త క్లోజ్ లవ్ సీన్లు వంటివి అస్సలు ప్లాన్ చేయకపోవడం వెనుక ఇదే కారణం అని కూడా వినికిడి.

నిజానికి కళ్యాణ్ ధేవ్ మీద ఎనిమిది కోట్లు పెట్టడం, సెంధిల్ కుమార్, రామకృష్ణ వంటి పెద్ద టెక్నీషియన్ల సపోర్ట్ ఇవన్నీ అందించడం అంటే చిన్న విషయం కాదు. మరి ఇప్పుడు మెగా స్టార్ ఏం చేస్తారో చూడాలి. తన అల్లుడుని ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యానర్ ను ఏదో విధంగా సాయం చేయాల్సిన అవసరం వుంది. ఇప్పటికే బన్నీ తాను వారాహిలో సినిమా చేస్తానని వాలంటరీగా ప్రకటించారు.

మరి మెగాస్టార్ ఏం చేస్తారు? ఆయన, రామ్ చరణ్ అయితే సినిమా మాట ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ల లైనప్ వాళ్లకు వుంది. ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్. వారాహి అధినేత సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూటర్ కూడా. బాహుబలి సిరీస్ ను చాలా ఏరియాల్లో ఆయనే పంపిణీ చేసారు. కర్ణాటక, సీడెడ్, కృష్ణా, వైజాగ్ వంటి ఏరియాల్లో ఆయనకు పంపిణీ వ్యవస్థ వుంది. అందువల్ల సైరా లాంటి భారీ సినిమా హక్కులు ఒకటి రెండు ఏరియాలకు అయినా, రీజనబుల్ రేట్లకు ఇచ్చి ఆదుకుంటారా? ఏమో చూడాలి.

సాధారణంగా ఇండస్ట్రీలో ఓ టాక్ అయితే వుంది. మెగాస్టార్ కు అలాంటి సెంటిమెంట్లు తక్కువ అని. ఎందరో నిర్మాతలు తనతోనే సినిమాలు తీసిన వాళ్లు కళ్ల ముందు చితికిపోయినా చిరంజీవి పట్టించుకొలేదని విమర్శలు వున్నాయి.  మొన్నటికి మొన్న కేఎస్ రామారావుతో తన కొడుకు సినిమా చేస్తాడని చిరంజీవి ప్రకటించినపుడు, ఇండస్ట్రీలో ఇవే గుసగుసలు వినిపించాయి. కేఎస్ రామారావును చిరకాలంగా దగ్గరకు కూడా రానివ్వలేదని, ఇప్పుడు ప్రకటించారని కామెంట్లు వినిపించాయి.

అందువల్ల అల్లుడు వల్ల నష్టపోయిన నిర్మాతకు ఏం సాయం చేస్తారో చూడాలి మెగాస్టార్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?