ఆర్ఆర్ఆర్… లెంగ్త్ తక్కువ

దిగ్దర్శకుడు రాజమౌళి తొలిసారి తన భారీ సినిమాను వీలయినంత తక్కువ నిడివితో అందించబోతున్నారు. ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి రెండున్నర గంటలు మించదని తెలుస్తోంది. సాధారణంగా…

దిగ్దర్శకుడు రాజమౌళి తొలిసారి తన భారీ సినిమాను వీలయినంత తక్కువ నిడివితో అందించబోతున్నారు. ఇద్దరు టాప్ హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నిడివి రెండున్నర గంటలు మించదని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి భారీ సినిమాలు అన్నీ దగ్గర దగ్గర మూడు గంటల వరకు వచ్చేయడం కామన్. కానీ ఈసారి మాత్రం అలాకాదట. కేవలం రెండున్నర గంటల వరకు లేదా ఆ లోపులే సినిమా పూర్తయిపోతుందట.

మూడే పాటలు
అంతేకాదు, ఎన్టీఆర్ కు ఒకటి, రామ్ చరణ్ కు ఒకటి, ఇద్దరికి కలిపి ఒకటి, ఇలా మొత్తం మూడే మూడు పాటలు వుంటాయట సినిమాలో. ఇద్దరు టాప్ హీరోలతో సినిమా చేస్తూ మూడే పాటలు అన్నది కాస్త సాహసమైన, వైవిధ్యమైన నిర్ణయమే. కానీ సినిమాను ఇలాగే తీయాలి, పాత్రల ఔచిత్యాలు దెబ్బతినకూడదు అన్న ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పులి ఫైట్ తోనే పరిచయం
సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇంట్రడక్షన్ నే ఫైట్ తో వుంటుంది. ఇటీవల ఎన్టీఆర్ పై పులి ఫైట్ చిత్రీకరించారని గ్రేట్ ఆంధ్ర వెల్లడించిన సంగతి తెలిసందే. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పరిచయ సన్నివేశం ఆ ఫైట్ తోనే వుంటుందని తెలుస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర మొత్తం భుజబలం తోనూ, రామ్ చరణ్ పాత్ర గుండె ధైర్యంతోనూ వున్నట్లుగా క్యారెక్టర్ డిజైన్ చేసారట.

స్టార్ తో చర్చలు
సినిమా శాటిలైట్ మొత్తం ఒకటే సంస్థకు ఇచ్చే ఆలోచనతో ఆర్ఆర్ఆర్ యూనిట్ స్టార్ గ్రూప్ తో చర్చలు ప్రారంభించింది. స్టార్ గ్రూప్ కు అన్నిభాషల్లో చానెళ్లు వున్నాయి. అందువల్ల అన్ని లాంగ్వేజ్ వెర్షన్లు ఒకే ఛానల్ కు ఇచ్చేయవచ్చు. జీ సంస్థ ప్రస్తుతం సినిమాలు కొనడం ఆపేసింది. అందువల్ల స్టార్ సంస్థతో చర్చలు షురూ అయినట్లు బోగట్టా.

రెండు నెలలు ఎక్కువే
ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేయడానికి పెట్టుకున్న టార్గెట్ 2020 జనవరి. అయితే మరో రెండునెలలు ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరు హీరోల కాంబినేషన్ సీన్లు ఎక్కువగా తీయలేదట. అవే బకాయి వున్నాయి. అందువల్ల అవన్నీ పూర్తిచేసి, టెక్నికల్ వర్క్ చూసుకుని, ఫైనల్ కాపీ రెడీ చేయడానికి మార్చి వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

సినిమాకు 250 నుంచి 300 కోట్ల మధ్యలో ఖర్చవుతుందన్నది తాత్కాలిక అంచనా. అయితే అంతకు అంతా బిజినెస్ కూడా వుంటుంది. తెలుగు ఏరియా థియేటర్ హక్కులతోనే సగానికి పైగా రిటర్న్ వచ్చేస్తుంది. శాటిలైట్, డిజిటల్ తో మిగిలినది భర్తీ అవుతుంది.

ఇక మిగిలిన ఏరియాలు, అదర్ లాంగ్వేజెస్ వుండనే వుంటాయి. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను 65 కోట్లకు విక్రయించారు. 2020 సమ్మర్ లో థియేటర్లలోకి వచ్చే ఆర్ఆర్ఆర్ కు డివివి దానయ్య నిర్మాత.

మారని చంద్రబాబు నాయుడు తీరు