నాని-శివ నిర్వాణల టక్ జగదీష్ ఓటిటి డీల్ ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ కు వచ్చింది. సంతకాలు కావడం మిగిలింది. 37 కోట్లకు అమెజాన్ ప్రయిమ్ కు టక్ జగదీష్ ను విక్రయించబోతున్నారు.
ఇది కాక హిందీ డబ్బింగ్, అడియో, శాటిలైట్ తదితర రేట్లు అన్నీ కలిపి దాదాపు 49 నంచి 50 కోట్ల మేరకు బిజినెస్ కు దారితీస్తాయి. సినిమాకు ఖర్చు రీజనబుల్ గానే అయ్యింది కానీ, రెండు సీజన్ల కరోనా వడ్డీల భారం భయంకరంగా పడింది.
దీంతో మంచి లాభాలు రావాల్సింది నార్మల్ లాభాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది నిర్మాత సాహు గారపాటికి. అయితే థియేటర్లు, రేట్లు, షోలు ఇవన్నీ చూసుకుంటే ఓటిటి డీల్ నే బెటర్ అనుకోవాలి. మజిలీ సినిమా తరువాత దర్శకుడు శివనిర్వాణ కు పేరు మరింత పెరిగింది. దాని తరువాత చేస్తున్న సినిమా టక్ జగదీష్.
ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ నటించింది. జగపతిబాబు కీలకపాత్ర పోషించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ అదనపు ఆకర్షణ. సాధారణంగా కేవలం భావోద్వేగాలతో కూడిన సినిమాలు అందించే శివనిర్వాణ ఈసారి దానికి మాస్ టచ్ కూడా జోడించడం విశేషం.