రుద్రమదేవిని అడ్డుకునే కుట్ర జరిగిందా?

రుద్రమదేవి సినిమా ఈ నెల 9న విడుదల కాకుండా కుట్ర జరిగిందా? టాలీవుఢ్ లో వినిపిస్తున్న గుసగుసలయితే దాన్నే అదే నిజం అంటున్నాయి. రుద్రమదేవికి చిన్నా పెద్దా సమస్యలు వున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని…

రుద్రమదేవి సినిమా ఈ నెల 9న విడుదల కాకుండా కుట్ర జరిగిందా? టాలీవుఢ్ లో వినిపిస్తున్న గుసగుసలయితే దాన్నే అదే నిజం అంటున్నాయి. రుద్రమదేవికి చిన్నా పెద్దా సమస్యలు వున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని సినిమాను ఓ నెల వెనక్కు తోయాలన్న ప్రయత్నం జరిగిందట. అయితే అదృష్టం కొద్దీ దాన్ని కొన్న బయ్యర్లు అంతా కాస్త మంచి మనసు వున్నవారు, ఆదుకునే కెపాసిటీ వున్నవారు కావడం కలిసి వచ్చింది. 

దిల్ రాజు, అరవింద్, సాయి కొర్రపాటి లాంటి వాళ్లు ఆదుకుని, విడుదలకు మార్గం చెేసారని వినికిడి. దీంతో, సీడెడ్, కృష్ణా, నైజాం, వైజాగ్, ఈస్ట్ లాంటి భారీ ఏరియాలన్నీ కవర్ అయిపోయాయి. దాంతో అలా ప్రయత్నించిన వారి యత్నాలు సాగలేదని వినికిడి. మరోపక్క రామ్ చరణ్ సినిమాను వాయిదా వేయమని నిర్మాత రామనారాయణ లేఖ రాసారు. ఇంకోపక్క చిరంజీవి అంటే అంతగా కిట్టని దర్శకుడు దాసరి, రుద్రమదేవిని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసారు. బన్నీ మాత్రం చరణ్ సినిమా వాయిదా వేయక్కరలేదని, అది ముందే ఫిక్సయిందని, తన సినిమానే లేటుగా వెనక్కు వచ్చిందని మర్యాదగా నోట్ ఇచ్చాడు. 

ఇవన్నీ చూస్తుంటే, రుద్రమదేవిని వాయిదా వేయించాలన్నది మెగాస్టార్ కొడుకు సినిమా కోసమేనా అన్న అనుమానం కలుగుతోంది. పైగా రుద్రమదేవి కోసం ఇండస్ట్రీలో జనాలు ఇటు అటు నిల్చున్నారా అన్న సందేహం కూడా కలుగుతోంది. ప్రస్తుతానికి రుద్రమదేవి కాస్త స్టడీగానే వుంది. కానీ సినిమా ఏమీ లేదని, కలెక్షన్లు లేవని ప్రచారం మొదలైంది. దీన్ని కావాలనే చేస్తున్నారని రుద్రమదేవి అభిమాన జనం అంటున్నారు.  

మొత్తానికి రుద్రమదేవి మరోసాటి టాలీవుడ్ వర్గాలను వెలికి తీసినట్లే వుంది.