కత్తికి కాస్త పదును వుండాలి. వుంటే కాస్త కటింగ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు బయ్యర్లు అయితేనేం..డిస్ట్రిబ్యూటర్ లు అయితేనేం..అదే చెబుతున్నారట..దర్శక నిర్మాత గుణశేఖర్ కు. కత్తికి పదును పెట్టి, రుద్రమదేవికి కోత కోయండి అని. ఎందుకంటే, సినిమా నిడివి బాగా పెరిగిందని వినికిడి,. అసలే హిస్టారికల్ మూవీ. అలాంటిదాన్ని గంటల తరబడి జనం చూడగలరా? సో,..రెండున్నర గంటల వరకు ఓకె కానీ అంతకు దాటితే కష్టం. మొన్నటికి మొన్న ఉత్తమ విలన్ పరిస్థితీ అదే.
రుద్రమదేవి అడియో ఫంక్షన్ జరిగి చాలా కాలం అయిపోయింది. ఇంకా నిర్మొహమాటంగా చెప్పాలంటే, జనం మరిచిపోతున్నారు ఆ సినిమా ఒకటి తయారవుతోందని. మరి గుణశేఖర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. సినిమా నిర్మాణానికి చాలా ఖర్చయిందని, ఫైనాన్స్ చాలా వుందని, అన్నీ కిట్టుబాటు చేసుకునే రేట్లు చెబుతుంటే, కొనే జనం ముందుకు రావడం లేదనీ..ఇలాంటపుడు వచ్చిన వాళ్లుచెప్పినట్లు విని, కత్తికి పదును పెట్టడం మంచిది..