రుద్రమదేవి విడుదలకు మళ్లీ గుణశేఖర్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నెల 24న విడుదల చేద్దామా లేదంటే, ఆగస్టు నెలాఖరుకు వెళ్దామా అని చూస్తున్నారు. వీలైతే ఈ నెల 24కు రావాలని వుంది.
Advertisement
కానీ బాహుబలి వెంటనే అంటే ఫలితం ఎలా వుంటుందో తెలియడంలేదు. అందుకే 10న ఫలితం చూసి, 24కు రావాలని, లేకుంటే ఆగస్టు ఆఖరుకు వెళ్లాలని చూస్తున్నారు. ఇదిలా వుంటే బాహుబలి ఫలితంపై మరి కొన్ని సినిమాల విడుదల ఆధారపడి వుంది.
అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ 17 అని టెంటటివ్ గా ప్రకటించేసారు కానీ, మరీ బాహుబలి సూపర్ అంటే మాత్రం మళ్లీ మరోసారి వాయిదాకు వెనుకాడకపోవచ్చు. కిక్ 2 ఈ నెల మరిచిపోవడమే అంటున్నారు.