Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ లో మరో హీరో పెళ్లికి రెడీ?

టాలీవుడ్ లో మరో హీరో పెళ్లికి రెడీ?

శర్వానంద్ ఇప్పటికే ఓ ఇంటివాడయ్యాడు. త్వరలోనే వరుణ్ తేజ్ కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలు ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో అతడికే తెలీదు. అయితే ఈ లిస్ట్ లోకి త్వరలోనే మరో హీరో చేరబోతున్నాడనేది టాలీవుడ్ హాట్ టాపిక్.

అతడే హీరో రామ్ పోతినేని. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ పోతినేని కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి, వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడంట. ఈ మేరకు రవికిషోర్, రామ్ కోసం ఓ మంచి సంబంధం చూసిపెట్టారనేది లేటెస్ట్ టాక్.

35 ఏళ్ల రామ్, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా కొనసాగుతున్నాడు. చిన్న వయసులో హీరోగా మారిన ఈ నటుడు, ఇన్నాళ్లూ తన కెరీర్ పై మాత్రమే దృష్టి పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లుగా వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం గ్యారెంటీ అంటున్నారు రామ్ కు దగ్గరివాళ్లు.

హైదరాబాద్ కే చెందిన ఓ బిజినెస్ మేన్ కూతురితో రామ్ పెళ్లి జరిపించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహం అంటున్నారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ మూవీ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. కానీ కొన్నాళ్లు ఆ సినిమాను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. దీనికి కారణం పెళ్లి అంటున్నారు చాలామంది.

రామ్ పెళ్లిపై పుకార్లు కొత్తగా వచ్చినవేం కాదు. ఇదివరకు చాలాసార్లు అతడి పెళ్లిపై రూమర్లు వచ్చాయి. అయితే ఈసారి కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. మేటర్ ఏంటనేది త్వరలోనే బయటకు వస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?