ఎస్ జె సూర్య @ 10 కోట్లు

ఎస్ జె సూర్య తెలుగునాట దర్శకుడిగా విఫలమై వుండొచ్చు. కానీ వైవిధమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల తమిళంలో చకచకా సినిమాలు చేస్తున్నారు. మన వాళ్లు కూడా ఆదరిస్తున్నారు. దాంతో మన తెలుగు సినిమాల్లోకి…

ఎస్ జె సూర్య తెలుగునాట దర్శకుడిగా విఫలమై వుండొచ్చు. కానీ వైవిధమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల తమిళంలో చకచకా సినిమాలు చేస్తున్నారు. మన వాళ్లు కూడా ఆదరిస్తున్నారు. దాంతో మన తెలుగు సినిమాల్లోకి కూడా ఎస్ జె సూర్య ను తీసుకుంటే ఎలా వుంటుంది అన్న ఆలోచనలు మొదలయ్యాయి. కానీ అతగాడు కోట్ చేస్తున్న రేటు చూసి మనవాళ్లు ఆ ఆలోచన విరమించుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

నాని- వివేక్ ఆత్రేయ- డివివి దానయ్య కాంబినేషన్ సినిమాలో ఓ కీలకపాత్రకు ఎస్ జె సూర్య ను తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ దానికి ఎస్ జె సూర్య వైపు నుంచి భారీ రెమ్యూనిరేషన్ కోట్ రావడంతో వెనక్కు తగ్గినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కోట్ ఎంత అన్నది క్లారిటీగా తెలియడం లేదు కానీ, పది కోట్లు అని టాక్ వినిపిస్తోంది. 

ఓ కీలకపాత్రకు పది కోట్లు ఇవ్వడం అంటే తెలుగులో ఓ బిలో మిడ్ రేంజ్ హీరో రెమ్యూనిరేషన్ అనుకోవాలి. సూర్యకు పది కోట్లు ఇస్తే, ఆ సినిమాకు రెమ్యూనిరేషన్లే దాదాపు నలభై కోట్లు దాటేస్తాయి. ఇక ప్రొడక్షన్ తో చూసుకుంటే సినిమా బడ్జెట్ 70 కోట్లు దాటేస్తుంది. అందుకే ఆల్టర్ నేటివ్ కోసం చూస్తున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.