సాహో అమ్మకాలపై భలే గ్యాసిప్

సినిమా గ్యాసిప్ లందు బిజినెస్ గ్యాసిప్ లు వేరయా అన్నారు. ఇవి రకరకాలుగా వుంటాయి. ఒకటి నిజంగా బిజినెస్ జరిగేవి. ఈ వార్తల్లో కోటి అటు కోటి ఇటుగా వుంటాయి. కొన్ని బిజినెస్ కోసం…

సినిమా గ్యాసిప్ లందు బిజినెస్ గ్యాసిప్ లు వేరయా అన్నారు. ఇవి రకరకాలుగా వుంటాయి.
ఒకటి నిజంగా బిజినెస్ జరిగేవి. ఈ వార్తల్లో కోటి అటు కోటి ఇటుగా వుంటాయి.
కొన్ని బిజినెస్ కోసం వదిలేవి. అలా వదిల్తే, బిజినెస్ పుంజుకుంటుంది అని గ్యాసిప్ లు వదుల్తారు.
అసలు బిజినెస్ జరిగినా, జరగకున్నా, జరిగిందనిపించేలా గ్యాసిప్ లు రావడం మూడోరకం.

లేటెస్ట్ గా సాహో మీద ఇలాంటి గ్యాసిప్ నే వచ్చింది. సాహో నిర్మాతలు యువి సంస్థతో నిర్మాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు వ్యాపార బంధాలు బలంగా వున్నాయన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, గీతా సంస్థతో కూడా యువికి వ్యాపార బంధాలు వున్నాయి. ఈ ముగ్గురు కలిసి ఓ సంస్థ పెట్టి కృష్ణాజిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో సాహో సినిమా విశాఖ, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే అన్న సంగతి ఇండస్ట్రీలో చిన్నపిల్లాడి దగ్గర నుంచి అందరికీ ఎప్పుడో తెలుసు. పైగా సాహో లాంటి భారీ సినిమాను దిల్ రాజు పంపిణీ చేస్తారు తప్ప కొనరు అని కూడా తెలిసిందే.

అంతేకాదు, ఈస్ట్, వెస్ట్ తప్ప మరే ఏరియాను సాహో అమ్మరు అని ఎప్పటి నుంచో వార్తలు వున్నాయి. ఎందుకంటే వైజాగ్ దిల్ రాజు, కృష్ణా దిల్ రాజు-యువి-గీతా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ల్లో యువి స్వయంగా చేసుకుంటారు.

అయితే దిల్ రాజు వైజాగ్ కు 15, నైజాంకు 35 అడ్వాన్స్ గా ఇవ్వాల్సి వుంటుందని ఎప్పటి నుంచో బిజినెస్ వర్గాల్లో టాక్ వుంది. అదంతా క్యాష్ అడ్జస్ట్ మెంట్ తప్ప, ఎంజీలు, ఎన్నాఆర్ఏ లు కాదు. ఎందుకంటే దిల్ రాజుకు, యువి మధ్య అలాగే వుంటుంది వ్యవహారం. మహర్షి సినిమాకు కూడా కృష్ణాలో ఆరుకోట్లు అడ్వాన్స్ పంపారు మూడు సంస్థలు కలిసి.

ఇలా వీళ్ల మధ్య వ్యాపారం అంతా అడ్వాన్స్ ల మీద నడుస్తుంది తప్ప, ఎక్కడా ఏ కమిట్ మెంట్ లు వుండవు. ఇది తెలియక, సాహో దిల్ రాజు ఇంతకు కొన్నాడు.. అంతకు కొన్నాడు అంటూ గ్యాసిప్ లు వచ్చేసాయి. కట్ పేస్ట్ చేసే వాళ్లు చేసేసారు.

వాస్తవానికి మరీ అధ్భుతమైన బేరం వస్తే తప్ప, సాహో అమ్మేది తక్కువ. ఈస్ట్, వెస్ట్ మాత్రమే అమ్మకానికి అన్నది బిజినెస్ సర్కిళ్ల మాట. అలా అని చెప్పి అందుకోసం కూడా ఈ గ్యాసిప్ పనికిరాదు. ఎందుకంటే బయ్యర్ల సర్కిళ్లకు ఈ వ్యవహారాలన్నీ క్లియర్ గా తెలిసిన సంగతే.

అందుచేత ఎవ్వరూ సీరియస్ గా తీసుకోరు ఈ గ్యాసిప్ ను.

ఈ రాజకీయ వారసుల భవితవ్యం ఏమిటి?