మొత్తానికి కాస్త ఆలస్యమైనా శర్వానంద్ – సుధీర్ వర్మ 'రణరంగం' సినిమా పూర్తయింది. ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిట్ పూర్తయింది. సెకండాఫ్ ఫైనల్ ఎడిట్ కూడా దాదాపు పూర్తయింది. కెరీర్ మీద చాలా కేర్ గా వున్న హీరో శర్వానంద్ ఫైనల్ ఎడిట్ అయిన కాపీ చూసుకున్నాడు. సాధారణంగా హీరోలు మొత్తం టెక్నికల్ వర్క్ కూడా అయ్యాక, ఓసారి చూడడం కామన్. కానీ ఈసారి శర్వా సినిమా మీద చాలా కేర్ గా వున్నాడట.
అందుకే ఎడిట్ కాపీ దగ్గరే ఓసారి చూసినట్లు తెలుస్తోంది. చూసిన తరువాత తన టీమ్ తో ముచ్చటిస్తూ, సినిమా బాగా వచ్చిందని అన్నట్లు బోగట్టా. గతంలో తన పాత్ర ఎలా వచ్చిందని మాత్రమే ఎక్కువగా చూడడం శర్వాకు అలవాటు. అలాంటిది ఈసారి సినిమా టోటల్ అవుట్ పుట్ ఎలా వుంది అన్నది పక్కాగా చూసుకున్నాడని తెలుస్తోంది.
ఇదిలావుంటే సితారకు బ్యాక్ బోన్ అయిన హారిక హాసిని చినబాబు కూడా ఎడిట్ కాపీ చూసి, వన్ ఆర్ టు స్మాల్ చేంజెస్ మాత్రం చెప్పి, శర్వాను కంగ్రాట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టులో విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఓ సాధారణ స్థాయి నుంచి టాప్ మాఫియా లీడర్ వరకు ఎలా ఎదిగాడు అన్నది స్టోరీ లైన్.
అయితే మామూలుగా ప్రెజెంట్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ల మాదిరిగా కాకుండా, పడుగు పేక మాదిరిగా రెండు షేడ్స్ ను చూపిస్తూ సుధీర్ వర్మ మాంచి స్క్రీన్ ప్లే అందించినట్లు తెలుస్తోంది.