Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో సెన్సార్ ఓవర్?

సాహో సెన్సార్ ఓవర్?

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో సెన్సారు అయిపోయిందా? అనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చాలా సైలెంట్ గా ముంబాయిలో అన్ని భాషల వెర్షన్లు కలిసి ఒకేసారి సెన్సారు చేయించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి ముంబాయికి తేడా ఏమిటంటే, ఇక్కడ ఇలా చూసి, అలా చెప్పేస్తారు ఏ సర్టిఫికెట్ ఇస్తారో. అలాగే పనిలో పనిగా ఎ కాకుండా యు/ఎ కావాలంటే ఏ మేరకు తీసేయాలో సూచిస్తారు. ఇలాగే కట్ ల గురించి కాస్త డిస్కషన్ వుంటుంది.

కానీ ముంబాయిలో అలా కాదు. ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో చెప్పడానికి టైమ్ తీసుకుంటారు. అప్పుడు డిస్కషన్లు వుంటాయి. ఇప్పుడు సాహో అదే పరిస్థితలో వుందని తెలుస్తోంది. సాహోకు యు/ఎ సర్టిఫికెట్ అవసరం. ఎ సర్టిఫికెట్ వస్తే ఇబ్బంది అవుతుంది. అయితే ఎ సర్టిఫికెట్ వచ్చేంత వయిలెన్స్, అడల్ట్ సీన్లు అయితే సినిమాలో వుండే అవకాశం లేదు. అందువల్ల యు/ఎ సర్టిఫికెట్ నే వచ్చే అవకాశం వుంది. అయితే ఎటొచ్చీ కాస్త కట్ లు పడొచ్చు.

సాహో నిడివి రెండు గంటల యాభై రెండు నిమిషాలు వుంటుందని తెలుస్తోంది. ఇందులోంచి స్మోకింగ్ యాడ్స్ టైమ్ తీసేయాలి. బహుశా ఈ రోజో, రేపో సాహో సెన్సారు సర్టిఫికెట్ వార్త బయటకు రావచ్చు.

బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?