జగన్ పై విషం.. నీచరాజకీయం

కొత్త ఒక వింత పాత ఒకరోత అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇప్పుడు ఏపీ బీజేపీ రాజకీయం అలాగే కనిపిస్తోంది. రాష్ట్రంలో నెంబర్ టూ పొజిషన్ లోకి రావాలనే యావ ఆ పార్టీకి…

కొత్త ఒక వింత పాత ఒకరోత అని తెలుగులో ఒక సామెత ఉంది. ఇప్పుడు ఏపీ బీజేపీ రాజకీయం అలాగే కనిపిస్తోంది. రాష్ట్రంలో నెంబర్ టూ పొజిషన్ లోకి రావాలనే యావ ఆ పార్టీకి కేవలం ఇప్పుడు మాత్రమే కాదు.. చాలాకాలం నుంచి ఉన్నదే కావొచ్చు గాక… పరిస్థితుల్ని అందుకు అనుకూలంగా మలచుకోవడానికి వారు నానాపాట్లు పడుతుండవచ్చు గాక.. కానీ అందుకోసం వారు గతంలో ఎన్నడూ నీచ రాజకీయాలకు పాల్పడలేదు. ఇప్పుడు ఆ పార్టీలోకి తెలుగుదేశం నుంచి కొత్తనీరు వచ్చిచేరిన తర్వాత.. వారితోపాటు అలవాటుగా నీచరాజకీయాలు కూడా వచ్చి చేరినట్లుగా కనిపిస్తోంది. వారి వాసన పార్టీకి కూడా అంటుతున్నట్టు కనిపిస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అమెరికాయాత్రలో ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేపడుతుండగా.. జ్యోతి వెలిగించేందుకు దీపస్తంభం వరకూ వెళ్లి.. అక్కడినుంచి జగన్ స్వయంగా తన చేత్తో దీపం అంటించకుండా.. వెనక్కు మళ్లారు అని అనిపించేలాగా ఒక వీడియో సోషల్ మీడియాలోకి లీక్ అయింది. అంత పెద్ద కార్యక్రమం జరిగితే.. అందులో జ్యోతిప్రజ్వలన కార్యక్రమంలో కూడా ఒక చిన్న, కొన్ని సెకన్ల భాగాన్ని పనిగట్టుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మార్చదలచుకున్న కుట్రదారులెవరై ఉంటారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు.

ఆ వీడియోతో ముడిపెట్టి.. జగన్మోహనరెడ్డి మతవిశ్వాసాలకు ఆపాదిస్తూ.. ఆయన క్రిస్టియన్ గనుక.. జ్యోతిప్రజ్వలనకు ముందుకు రాలేదని… గతంలో హిందూ పూజలు చేయడం, హిందూ దేవాలయాలకు వెళ్లడం లాంటివన్నీ మెజారిటీ ఉన్న హిందూ ఓటర్లను మోసం చేయడానికేనని వీర బీభత్సంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఇది హిందువులను అవమానించడమేనని, ఎన్నికలప్పుడు దేవాలయాలు తిరిగిందంతా మోసమని బీజేపీ కొత్తనాయకుడు సీఎం రమేష్ ఓ ట్వీటు పెట్టారు,

అదే నీచరాజకీయాన్ని పార్టీ కూడా ఒంటికంతా పులుముకుంది. జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలనకు నిరాకరించినట్లుగా భాజపా ఆంధ్రప్రదేశ్ కూడా ట్వీట్ చేసింది. తీరాచూస్తే ఇదంతా అబద్ధపు ప్రచారం. వాస్తవంగా అక్కడ ఏర్పాటుచేసిన దీపస్తంభంలో చమురు దీపాలు కాదు, ఎలక్ర్టిక్ ఆటొమేటిక్ దీపాలు. అందువల్లనే జగన్ చేతులతో వెలిగించలేదు. నిజం తెలియకుండా.. తెలిసినా విషం కక్కడానికి భాజపా నాయకులు పడుతున్న నీచ తాపత్రయం చూసి జనం అసహ్యించుకుంటున్నారు.

బాహుబలి' ఇంకా కలగానే ఉంది