Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబునాయుడు.. జగన్‌కు సలహాదారా?

చంద్రబాబునాయుడు.. జగన్‌కు సలహాదారా?

ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా సరే.. వారు సర్వజ్ఞులయి ఉంటారని, సమస్త విషయాల్లోనూ వారికి పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుందని అనుకోవడం కల్ల. అందుకే.. ముఖ్యమంత్రులు, ప్రధానులు కూడా తమకు సలహాదార్లను నియమించుకుంటూ ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు వారి సలహాలను అనునసరిస్తూ ఉంటారు. అయితే.. ఇవాల ఏపీ రాజకీయల్లో కనిపిస్తున్న చిత్రం ఏంటంటే... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి సలహాదారులాగా సలహాలు ఇస్తున్నారు. కాకపోతే ఆయన అనధికారిక, అనియమిత సలహాదారు అనుకోవాలి.

ఎందుకంటే.. అమరావతిగా ప్రస్తుతం పిలుస్తున్న ప్రదేశంలో రాజధాని నిర్మిస్తే ఎన్నిరకాల ముప్పు పొంచి ఉన్నదో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో అదే స్థలంలో రాజధాని కట్టాలని చంద్రబాబునాయుడు సూచిస్తున్నారు. తన ప్రభుత్వం నయానాభయానా సేకరించిన 33 వేల ఎకరాల్లో మౌలిక అవసరాలు అన్నింటికీ పోగా, 8వేల ఎకరాలు మిగులుతాయని... వాటినిన అమ్ముకుని అయినా సరే.. మంచి రాజధానిని కట్టవచ్చునని ఆయన సూచిస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాజధానిని ఎలా నిర్మించాలో... ఆర్థిక భారం లేకుండా నిర్మించడం ఎలా సాధ్యమో.. మాజీ ప్రభుత్వాధినేత సలహా ఇస్తున్నాడు.

ప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. మరిన్నాళ్లూ చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు. ఆయన ల్యాండ్ పూలింగ్ పూర్తిచేసి కూడా సంవత్సరాలు గడిచాయి. 8వేల ఎకరాలు అమ్మేస్తే రాజధాని నగరం మొత్తం నిర్మించడానికి సరిపడా నిధులు సమకూరుతాయనే క్లారిటీ ఆయనకు ఉన్నప్పుడు.. ఆ పని ఆయన ఇన్నేళ్లూ ఎందుకు చేయలేకపోయారు. ఎకరాల మీద అంత స్పష్టమైన లెక్కలు తన వద్ద ఉన్నప్పుడు.. 8వేల ఎకరాల్ని అమ్మకానికి పెడితే.. కనీసం రెండువేల ఎకరాల అమ్మకం పూర్తిచేసి ఉన్నా కూడా.. కనీసం ఎడ్మినిస్ట్రేటివ్ రాజధాని కోర్ కేపిటల్ వరకు పూర్తయిపోయేది.

కనీసం ఒక్క భవనాన్ని పూర్తిచేసి ఉన్నా.. చంద్రబాబును , ఆయన చిత్తశుద్ధిని ప్రజలు నమ్మేవాళ్లు. అలాంటిదేమీ లేకుండా.. కేవలం అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా, కంప్యూటర్లలో రాజధాని డిజైన్లు చూపించి మోసం చేయాలనుకోవడం వల్లే ప్రజలు తిరస్కరించారు. ఆ సంగతి ఆయన తెలుసుకుని, జగన్ సర్కారుకు సలహాలివ్వడం మానుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు.

బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?