జేమ్స్ బాండ్ మళ్లీ వస్తున్నాడు

వరల్డ్ సినిమాపై జేమ్స్ బాండ్ ది ప్రత్యేకస్థానం. వసూళ్ల పరంగా ఈ సినిమాలు రికార్డులు సృష్టించకపోయినప్పటికీ జేమ్స్ బాండ్ సినిమా అంటే అదో బ్రాండ్. ఆ స్టయిల్, మేకింగ్ అంతా విలక్షణం. దశాబ్దాలుగా సినీప్రేక్షకుల్ని…

వరల్డ్ సినిమాపై జేమ్స్ బాండ్ ది ప్రత్యేకస్థానం. వసూళ్ల పరంగా ఈ సినిమాలు రికార్డులు సృష్టించకపోయినప్పటికీ జేమ్స్ బాండ్ సినిమా అంటే అదో బ్రాండ్. ఆ స్టయిల్, మేకింగ్ అంతా విలక్షణం. దశాబ్దాలుగా సినీప్రేక్షకుల్ని అలరిస్తున్న జేమ్స్ బాండ్, ఇప్పుడు మరో మూవీతో రెడీ అయ్యాడు. జేమ్స్ బాండ్ కొత్త సినిమా పేరు “నో టైమ్ టు డై”.

2006 నుంచి జేమ్స్ బాండ్ గా నటిస్తున్న డానియర్ క్రెగ్, ఈ కొత్త జేమ్స్ బాండ్ సినిమాలో కూడా బాండ్-007గా కనిపించబోతున్నాడు. ఒప్పందం ప్రకారం ఇతడికిది ఆఖరి జేమ్స్ బాండ్ చిత్రం. ఈ సినిమాతో అతడు 5 జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించినట్టవుతుంది. నో టైమ్ టు డై సినిమాను యూకే, ఇండియాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 3న.. అమెరికాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 8న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

2015 తర్వాత మళ్లీ జేమ్స్ బాండ్ సినిమా తెరపైకి రాలేదు. నిజానికి ఈ కొత్త సినిమా గతేడాదే రిలీజ్ కావాల్సింది. కానీ పైన్ వుడ్ స్టుడియోస్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అదే ప్రమాదంలో డానియల్ క్రెగ్ కూడా గాయపడ్డంతో షూటింగ్ ఇంకాస్త లేట్ అయింది.

బాహుబలి' ఇంకా కలగానే ఉంది