సాహో.. స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి తరువాత చేస్తున్న మరో భారీ సినిమా. ఈ సినిమా కోసం చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే విదేశీ జనాలే ఆశ్చర్యపోతున్నారట. ఓ రీజనల్ లాంగ్వేజ్ సినిమాకు ఈ రేంజ్ ఖర్చు, ఈ రేంజ్ ఏర్పాట్లా అని ఆశ్చర్యపోతున్నారట.
ఈ సినిమా కోసం దుబాయ్ ప్రాంతంలో ఏకంగా ఓ భారీ వర్క్ షాప్ నే ఏర్పాటు చేసేసారట. అదేదో ఓ చిన్న సైజ్, ఫ్యాక్టరీని తలపిస్తోందట. అక్కడ కొన్ని కోట్లు ఖర్చు చేసి రెండు మూడు భారీ ట్రక్ లు కొనుగోలు చేసారట. వాటిని సినిమాకు అనుగుణంగా మారుస్తున్నారట.
ఇక్కడ నుంచి ఓ భారీ ప్రొక్లయిన్ లాంటిది ప్రత్యేకంగా తయారుచేసి అక్కడికి పంపించారట. ఇది పంపడం కోసం, తయారీ కోసం నానా తంటాలు పడినట్లు తెలుస్తోంది. రెండు మూడు విఫలయత్నాల తరువాత ఆఖరికి పని జరిగిందని వినికిడి.
ఇలా కేవలం ఒక ఛేజ్ కమ్ ఫైటింగ్ ఎపిసోడ్ కే కోట్ల రూపాయిలు ఖర్చుచేస్తున్నారు. పక్కా జేమ్స్ బాండ్ కథతో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం యూవీ సంస్థ జనాలు మరే ఇతర పని కూడా పట్టించుకోకుండా మమేకం అయిపోయారట. ఆఖరికి త్వరలో విడుదల కావాల్సిన టాక్సీవాలా పని కూడా నిర్మాతకెే వదిలేసి, సూపర్ వైజ్ చేయడం అన్నదే మరిచిపోయేంతగా సాహోలో మునిగిపోయారని తెలుస్తోంది.