Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో.. ఇది కదా కావాల్సింది

సాహో.. ఇది కదా కావాల్సింది

మొత్తానికి బాహుబలి ప్రభాస్ సాహో సినిమా టీమ్ తెలుగునేల మీదకు వచ్చింది. ప్రభాస్ తెలుగు అభిమానులకు ఏం కావాలో తెలుసుకుంది. సూపర్ రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేసింది. దాంతో పాటే 30 ఆగస్టు విడుదల అంటూ డేట్ కన్ ఫర్మ్ చేసింది.

పోస్టర్ లో ప్రభాస్-శ్రద్ధ లుక్స్ అభిమానులను అలరించేలా వున్నాయి. పోస్టర్ డిజైనింగ్, వాడిన లైట్ కలర్స్ కూడా బాగున్నాయి. ఫ్యాన్స్ కు మనదైన సినిమా చూస్తామన్న ఫీల్ కలిగించేలా వుంది. ఇన్నాళ్లు బైక్ లు, కార్లు, ఛేజింగ్ లు, హడావుడి తప్ప, స్టడీగా వున్న మంచి స్టిల్ రాలేదు. ఇప్పుడు ఈ స్టిల్ ఆ లోటు తీర్చేసింది.

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొలిక్కి రావడంతో సాహో టీమ్ ఇప్పుడు పబ్లిసిటీ మీద దృష్టిపెట్టింది. ఇప్పటికే ఓ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఇంకో సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఆగస్టు రెండోవారంలో భారీ ప్రీరిలీజ్ ఫంక్షన్ వుంటుంది.

పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఘోరంగా ఓటమి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?