బాహుబలి ప్రభాస్ భారీ సంచలనం సాహో సినిమా ట్రయిలర్ విడుదల మరో రెండు రోజుల్లో. 10న ముంబాయిలో సాహో ట్రయిలర్ విడుదల వుంటుంది. ఆ మర్నాడు తెలుగు ట్రయిలర్ విడుదల హైదరాబాద్ లో వుంటుంది. అయితే ఇప్పటికే ట్రయిలర్ గురించి కాస్త సమాచారం బయటకు వచ్చింది.
ట్రయిలర్ సుమార్ రెండు నిమిషాల పాటు వుంటుంది. ఇప్పటి వరకు కేవలం భారీ యాక్షన్ ఎపిసోడ్ లు మాత్రమే సాహో ప్రచార మెటీరియల్ లో బయటకు వచ్చాయి. కానీ ట్రయిలర్ అలా వుండదు. ట్రయిలర్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా వుండబోతోంది అన్నది రివీల్ చేస్తున్నారు. ఫన్ టచ్ తో కూడిన క్యారెక్టర్ ను ఫ్రభాస్ చేస్తున్నాడు అన్నది ట్రయిలర్ లో రివీల్ కాబోతోంది.
సినిమా గ్రాండియర్, భారీ ఎపిసోడ్ లు అన్నవి ఎలాగూ ట్రయిలర్ లో వుంటాయి. వాటికి అదనంగా డైరక్టర్ సుజిత్ ఏం చేసాడు? అతని పార్ట్ ఏమిటి? ప్రభాస్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసాడు అన్నది ట్రయిలర్ లో చూపించబోతున్నారు. టీజర్ లో జస్ట్ ఒక్క డైలాగు 'ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్' అన్నదానికే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ట్రయిలర్ లో ఇదే ఫన్ బేస్డ్ గా మరికొన్ని డైలాగులు వుంటాయి.
బాలీవుడ్ నటులతో పాటు తెలుగు నటులు వెన్నెల కిషోర్, మురళీశర్మ ట్రయిలర్ లో కనిపిస్తారు.