cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో... ట్రయిలర్.. సాహోరె

బాహుబలి ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సాహో ట్రయిలర్ వచ్చేసింది. ఇప్పటివరకు ఒకలెక్క, ట్రయిలర్ వచ్చాక మరో లెక్క అన్నట్లుగా వుంది. సాహో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా వుందీ ట్రయిలర్ కట్. ట్రయిలర్ లో వేసిన షాట్స్ విజువల్స్ అన్నీ అత్యంత ఉన్నతంగా వున్నాయి. సినిమాలో కథేంటీ అన్నది దాచడానికి పెద్దగా ప్రయత్నించలేదు. ట్రయిలర్ ఫస్ట్ షాట్ ఫస్ట్ డైలాగ్ లోనే రెండువేల కోట్ల రాబరీ అన్న పాయింట్ తో సార్ట్ చేసారు.

హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లు, విలన్ లు ఇతరత్రా వ్యవహారాలు అన్నీ రివీల్ చేసారు. పూర్తిగా విజువల్ ఫీట్ ఈ సినిమా అన్న దాని మీదే ట్రయిలర్ కట్ సాగింది. వేసిన ప్రతి షాట్ విజువల్ అభిమానులను అలరించేలా వుంది. ఇన్నాళ్లు సాహో సినిమాకు ఇంత ఖర్చయింది, అంత ఖర్చయింది అన్న వార్తలు మాత్రమే వున్నాయి. ఇప్పుడు ఈ ట్రయలర్ చూసాక ఎందుకు ఖర్చయింది అన్న దాంట్లో క్లారిటీ వచ్చింది.

ప్రభాస్ హెయిర్ స్టయిల్ రెండు మూడు రకాలుగా వుంది. జుట్టు పైకి దువ్విన స్టయిల్ మినహా మిగిలిన స్టయిల్స్ లో చాలా అందంగా కనిపించాడు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తానికి సాహో ఫీవర్ స్టార్ట్ అయింది. విడుదల నాటికి ఇది ఇంకా పెరిగే అవకాశం వుంది.