యూత్‌లో ఫాలోయింగ్ వుంది కనుక తన సినిమాలకి మినిమం గ్యారెంటీ వుందనే ధోరణి చూపించిన విజయ్ దేవరకొండకి 'డియర్ కామ్రేడ్' రియాలిటీ చెక్‌గా ఉపయోగపడింది. ఈ చిత్రం తొలి రోజు రాబట్టిన వసూళ్లని మిగతా రన్‌లో కూడా రాబట్టుకోలేకపోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది. 'నోటా' తమిళ సినిమా అనుకుని లైట్ తీసుకున్నా ఈ చిత్ర ప్రభావం అతడిని షేక్ చేసింది.
దీంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన ప్లానింగ్ మార్చుకుంటున్నాడు. ఒకే తరహా చిత్రాలకి కట్టుబడి వుండాలనుకున్న అతను మిగతా జోనర్స్ కూడా ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడు. పూరి జగన్నాధ్‌తో ఒక మాస్ చిత్రం చేయడానికి అంగీకరించాడనే వార్తలొస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి పూరీ తనని అప్రోచ్ అయితే విజయ్ ఆసక్తి చూపించలేదట. ఆమధ్య కొందరు అగ్ర దర్శకులు కాంటాక్ట్ చేసినా వెంటనే చేయాలనే ఉత్సాహం కనబర్చలేదట.
అలాంటిది ఇప్పుడు తన మార్కెట్ పూర్తిగా డౌన్ అవకముందే దానిని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. యూత్ సినిమాలు మాత్రమే కాకుండా అన్ని తరహా చిత్రాలు చేయాలని భావిస్తున్నాడు. రెబల్ ఇమేజ్‌ని విడిచిపెట్టి మాస్, కమర్షియల్ చిత్రాలపై దృష్టి పెడుతున్నాడు.