ఫ్లాప్ హీరోకు మరింత టెన్షన్ పెరిగిపోతోందట

అసలే వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో కొత్త సినిమాపై రోజుకో వార్త వస్తుంటే తెగ ఇబ్బందిగా ఉందంటున్నాడు సాయిధరమ్ తేజ్. మరీ ముఖ్యంగా ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు మా సినిమాకు పేర్లు…

అసలే వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో కొత్త సినిమాపై రోజుకో వార్త వస్తుంటే తెగ ఇబ్బందిగా ఉందంటున్నాడు సాయిధరమ్ తేజ్. మరీ ముఖ్యంగా ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు మా సినిమాకు పేర్లు పెట్టేస్తున్నారని, దయచేసి కాస్త ఓర్పుతో ఉండమని కోరుతున్నాడు సాయిధరమ్ తేజ్.

“మీరెవరూ కంగారు పడకండి. మంచి టైటిల్ త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం. మీరు ఏవేవో ఊహించుకొని రాయకండి. ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్ లో ఏవేవో రాసేస్తుంటే ప్రెషర్ ఇంకా పెరిగిపోతోంది. సో.. మా డైరక్టర్, ప్రొడ్యూసర్ కలిసి ఓ టైటిల్ ఫైనల్ చేసి త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం. మాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు కొంచెం ఓర్పుతో ఉండండి.”

గతేడాది నుంచి ఇప్పటివరకు సాయిధరమ్ తేజ్ నటించిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్.. ఇలా ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతోంది. దీంతో తన అప్ కమింగ్ మూవీపై ఎలాంటి బజ్ లేకుండా జాగ్రత్తపడుతున్నాడు తేజూ. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వస్తే మినిమం గ్యారెంటీ అయినా ఉంటుందనేది తేజూ ఫీలింగ్.

కానీ సాయిధరమ్ తేజ్, కరుణ్ కరన్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వచ్చినప్పట్నుంచి, ఆ సినిమా టైటిల్ ఇదేనంటూ రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్తలతో చాలా ఇబ్బందిపడిన తేజు మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేశాడు. తనపై ఒత్తిడి పెరిగిపోతోందని, దయచేసి ఓర్పుతో ఉండమని కోరుతున్నాడు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

పడుతున్నాడు