సాయిపల్లవికి బాగా కనెక్ట్ అయ్యాడు..!

సాయి పల్లవికి తలపొగరంటూ ఓవైపు నాగశౌర్య లాంటి హీరోలు బాహాటంగా చెబుతున్నప్పటికీ, మరోవైపు ఆమెను ఇష్టపడే హీరోల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. తాజాగా సాయిపల్లవి ఫ్యాన్ హీరోల లిస్ట్ లోకి శర్వానంద్ కూడా చేరిపోయాడు.…

సాయి పల్లవికి తలపొగరంటూ ఓవైపు నాగశౌర్య లాంటి హీరోలు బాహాటంగా చెబుతున్నప్పటికీ, మరోవైపు ఆమెను ఇష్టపడే హీరోల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. తాజాగా సాయిపల్లవి ఫ్యాన్ హీరోల లిస్ట్ లోకి శర్వానంద్ కూడా చేరిపోయాడు. ప్రస్తుతం ఆమెతో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్.. వెంటనే మరో సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడు. 

సాయిపల్లవి, శర్వానంద్ కాంబోలో 'పడిపడి లేచే మనసు' అనే సినిమా తెరకెక్కుతోంది. హను రాఘవపూడి దీనికి దర్శకుడు. ఈ సినిమా సెట్స్ లోనే సాయిపల్లవిని చూసి ఫిదా అయ్యాడట శర్వానంద్. ఆమె చలాకీతనం, యాక్టింగ్ అతడికి బాగా నచ్చాయట. అందుకే తన నెక్ట్స్ సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. 

'నీది నాది ఒకే కథ' సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల, మరో కథ రాసుకున్నాడు. శర్వానంద్ కు వినిపించాడు. శర్వాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ హీరోయిన్ పాత్ర కోసం తనే స్వయంగా సాయిపల్లవి పేరును సూచించాడు. త్వరలోనే ఈ కొత్త సినిమా డీటెయిల్స్ అఫీషియల్ గా బయటకొస్తాయి.