మెగాస్టార్ మెగా మూవీ సైరా సినిమా నైజాం పంపిణీ హక్కులను సుప్రసిద్ద పంపిణీ సంస్థ యువి క్రియేషన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ కు సైరా నిర్మాత రామ్ చరణ్ కు మాంచి స్నేహ సంబంధాలు వున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు యువి సంస్థ సైరా హక్కులు తీసుకుని, పంపిణీ బాధ్యతలు దిల్ రాజుకు అప్పగించినట్లు తెలుస్తోంది.
సైరా నైజాం హక్కుల కింద 30 కోట్లు ఇవ్వడానికి యువి క్రియేషన్స్ అంగీకరించినట్లు తెలుస్తోంది. సైరా సినిమా నైజాం రైట్స్ ముఫై కోట్లు అంటే కాస్త రీజనబుల్ అనే అనుకోవాలి. సినిమా హిట్ అయితే ఈ రేటు ఓకెనే. మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ అని నైజాంలో అనిపించుకుంటే జిఎస్టీ కాకుండా 26 కోట్ల వరకు వచ్చింది. సైరా భారీ సినిమా కనుక 30 కోట్లకు ధైర్యం చేసినట్లు కనిపిస్తోంది.
ఇదిలావుంటే ఆంధ్రకు 60 కోట్ల రేషియోలో లెక్కకట్టి ఉత్తరాంధ్ర హక్కులు 14.50 కోట్లకు క్రాంతి పిక్చర్స్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన ఏరియాలు సంప్రదింపులు నడుస్తున్నాయి.