Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా నాన్ తెలుగు పరిస్థితి ఏమిటి?

సైరా నాన్ తెలుగు పరిస్థితి ఏమిటి?

మెగాస్టార్ మెగా మూవీ సైరా విడుదల దగ్గరకు వచ్చేసింది. గట్టిగా రెండువారాలు మాత్రమే సమయం మిగిలింది. సినిమాకు తెలుగునాట ప్లాన్డ్ గానే పబ్లిసిటీ జరుగుతోంది కానీ నాన్ తెలుగు ఏరియాల పరిస్థితి ఏమిటో అర్థంకావడం లేదు. ఇదే మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. పాన్ ఇండియా సినిమా అంటూ భారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇలా విడుదలైన సినిమాలు బాహుబలి వన్, 2, సాహో వున్నాయి. ఇవికాక మలయాళ, తమిళ వెర్షన్లు విడుదలయిన సినిమాలు చాలా వున్నాయి. ఇప్పుడు వాటి ముందు సైరా ఏ మాత్రం తీసిపోవడానికి లేదు.

కానీ పరిస్థితి చూస్తుంటే సైరా నాన్ తెలుగు ఏరియాల పబ్లిసిటీని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా హిందీ ఏరియాలో టఫ్ కాంపిటీషన్ వుంది. వార్ లాంటి భారీ అంచనాలు వున్న సినిమా వస్తోంది. అలాంటపుడు దానికి దీటుగా ప్రచారం సాగించాల్సిన అవసరం వుంది. పైగా సాహో హిందీ రికార్డు వుండనే వుంది.

ఈ పన్నెండు రోజుల్లోనే ఏం చేసినా చేయాలి. ఇప్పటికి ఒక్కసారి మాత్రమే బాలీవుడ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. బంగళూరు, చెన్నయ్, కేరళ వెళ్లాలి. వీలైతే ముంబాయి వెళ్లాలి. కానీ చిరంజీవి వయసు రీత్యా ఇవన్నీ ఒకటి రెండురోజుల్లో ఫినిష్ చేయగలరా అన్నది అనుమానం. తెలుగు ఈవెంట్ అయ్యేవరకు ఇక్కడి నుంచి వెళ్లకపోవచ్చు. అది అయిన తరువాత ఇక మిగిలేది గట్టిగా 10రోజులు మాత్రమే.

తెలుగులో కూడా సైరా సినిమా రేంజ్ చూసి మీడియా స్వయంగా ఇస్తున్న కవరేజ్ నే. బాహుబలి, సాహో విషయాల్లో కూడా ఇలాగే జరిగింది. మీడియా ఆసక్తి వల్లనే తప్ప, యూనిట్లు పట్టించుకోవడం తక్కువ. సినిమా విడుదలకు ముందు మీడియాకు కావాల్సిన పబ్లిసిటీ మెటీరియల్ ను పట్టిుంచుకోరు. కానీ సినిమా హిట్ అయితే ఓకె. తేడా వస్తే మాత్రం, మీడియా గుర్తుకువస్తుంది. అందులో నెగివిట్ వార్తలు రాకూడదని అనుకుంటారు. సినిమాకు ముందు మీడియా వీళ్లకు గుర్తుండదు. సినిమా తరువాత మీడియాకు వాళ్లు గుర్తుండరు.

పైగా సైరా విషయంలో ఒకరు ఇద్దరు కాదు, చాలామంది కీలక బాధ్యులు వున్నారు. ఒక్క స్టిల్ కావాలన్నా కూడా ఇంతమంది చేతుల్లోంచి రావాలి. అది కూడా అతి పెద్ద సమస్య. మెగాస్టార్ కు తెలియకుండా, చూడకుండా, ఒక్క స్టిల్ వదలడానికి లేదు. చూడడానికి లేదు. కానీ ఆయన సవాలక్ష పనుల్లో బిజీగా వుంటారు.దీనికి ఓ వ్యక్తి అంటూ ఎవ్వరూ ఫిక్స్ గా వుండరు.

సాహో విషయంలో కూడా ఇలానే జరిగింది. సినిమా విడుదలకు ముందు ఫ్యాన్స్ కానీ, మీడియా కానీ ఒక్క స్టిల్ అంటే జవాబు వుండేదికాదు. సినిమా విడుదల తరువాత, షేర్లు ఆగిపోయాక, అద్భుతమైన స్టిల్స్ వరుసగా వదుల్తున్నారు. ఏం చేసుకోవాలి?

ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత అయినా సైరా స్ట్రాటజీ మారుతుందేమో చూడాలి.

గ్రేట్ ఆంధ్ర ఈవారం స్పెషల్ బిగ్ స్టోరీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?