Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సఖి మార్కులు కొట్టేసింది

సఖి మార్కులు కొట్టేసింది

'మహానటి' అని కచ్చితంగా అనిపించుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా సర్కారువారి పాట, రంగ్ దే, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ సినిమాల నుంచి శుభాకాంక్షలు వెలువడ్డాయి. రంగ్ దే సినిమా దాదాపు 80శాతం పూర్తి కావచ్చింది.

మిస్ ఇండియా పూర్తయిపోయి, నెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్దంగా వుంది. కానీ చిత్రంగా ఈ రెండు సినిమాల నుంచి ఎటువంటి విడియోలు విడుదల కాలేదు. సర్కారువారి పాట అంటే వేరు. అది ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. 

ఇలాంటి నేపథ్యంలో గుడ్ లక్ సఖీ సినిమా నుంచి చిన్న విడియో వచ్చింది. ఈ విడియోలో వున్న లుక్ తో కీర్తిని ఇంతకు ముందే ఒక సారి చూపించారు. అయినా ఈ సారి వదిలిన విడియో కూడా బాగా ఆకట్టుకుంది. పల్లెటూరి అమాయకపు అమ్మాయి గెటప్ లో కీర్తి సురేష్ పక్కా ఆకట్టుకునేలా కనిపించింది. 

గుడ్ లక్ సఖీ సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తోంది. మరి ఇప్పటికైనా పూర్తయిందో లేదో, ఆన్ లైన్ లో వస్తుందో? థియేటర్ల కోసం వెయిట్ చేస్తుందో తెలియాల్సి వుంది. నగేష్ కుకునూరు ప్రాజెక్టు ను దిల్ రాజు బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?