Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సలార్ రిలీజ్ - డిసెంబర్ నిజమేనా?

సలార్ రిలీజ్ - డిసెంబర్ నిజమేనా?

ఉన్నట్లుండి చిన్న కుదుపు. సలార్ సినిమా డిసెంబర్ 22 న విడుదలకు రెడీ అవుతోంది అన్నది ఆ వార్త. చాలా నమ్మకమైన హ్యాండిల్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసాయి. దానికి తోడు ఈ మేరకు సమాచారం అందినట్ల డిస్ట్రిబ్యూషన్ వర్గాలు కూడా తెలిపాయి. దీంతో ఆ రోజు సలార్ విడుదల దాదాపు ఫిక్స్ అని గట్టిగా నమ్మాల్సి వస్తోంది.

కానీ ఒక్కటే అనుమానం. అదే రోజు షారూఖ్ ఖాన్ డుమ్కీ సినిమా కూడా వుంది. దీని వల్ల సలార్ కు బాలీవుడ్ లో చాలా గట్టి ఎఫెక్ట్ పడుతుంది. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో ఇప్పుడు షారూఖ్ ఖాన్ టైమ్ నడుస్తోంది. అందువల్ల సలార్ విడుదల డేట్ మీద ఇంకా అనుమానాలు పోలేదు.

పైగా ఈ డిసెంబర్ 22 అన్నది బాలీవుడ్ లోని సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి బయటకు వచ్చింది తప్ప అధికారికంగా కాదు. అంటే నిర్మాతలు కావాలనే ఆ హ్యాండిల్స్ ద్వారా ఈ రూమర్ ను స్ప్రెడ్ చేయించి వుంటారని నమ్మాల్సి వస్తోంది.

ఈ డేట్ కు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఎలా స్పందిస్తారో చూసి, దానిని బట్టి నిర్ణయం తీసుకునేందుకు ఈ ఎత్తుగడ వేసి వుంటారని కూడా టాక్ వినిపిస్తోంది.

సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన సలార్ వాయిదా పడిన దగ్గర నుంచి, రకరకాల డేట్ లు వినిపిస్తూనే వున్నాయి.

నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి ఇలా రకరకాల డేట్ లు. ఎటొచ్చీ ఈసారి కాస్త నమ్మకంగా గ్యాసిప్ వచ్చింది. సలార్ వస్తే, అక్కడ విడుదలకు ప్లాన్ చేసుకున్న హీరోలు నాని, వెంకటేష్, నితిన్ ల సినిమాకు చెల్లా చెదురు అయిపోతాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?