స్కంధ.. హీరో రామ్.. దర్శకుడు బోయపాటి కాంబినేషన్. బోయపాటి సినిమా అంటే ఓ బ్రాండ్ వుంటుంది. కానీ స్కంధ ఆ బ్రాండ్ లో ఒదగడానికి లొంగడం లేదు.
టీజర్ నుంచి ట్రయిలర్ మీదుగా రెండో ట్రయిలర్ వరకు వచ్చింది. ఒక్కోసారి ఒక్కో టచ్ కనిపిస్తోంది. అన్నింట్లో కామన్ గా వున్నది యాక్షన్ టచ్. ఆ యాక్షన్ సీన్లు మామూలుగా లేవు. బోయపాటి లైన్ ను ఆయనే క్రాస్ చేసి కొత్త లైన్ గీసుకుంటున్నట్లుంది.
పొలిటికల్ టచ్ గట్టిగానే కనిపిస్తోంది. చంద్రబాబు, జగన్, కేసిఆర్ పాత్రలు వుండేలాగే కనిపిస్తున్నాయి. అయితే అవేమీ నేరుగా లేవు. గుర్తించేలా లేవు. కథలో భాగంగానే కనిపిస్తున్నాయి. కానీ వీళ్లందరి మధ్య హీరో ఏమిటి? హీరో రెండు షేడ్స్ ఏమిటి అన్నది మాత్రం రెండు ట్రయిలర్లు వచ్చినా రివీల్ చేయలేదు. అది స్పెషాలిటీ.
ఇక బోయపాటి మార్క్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ జనాలను టచ్ చేయడం ఇవన్నీ ట్రయిలర్ లో కనిపించాయి. పవర్ ఫుల్ ఎమోషన్స్ ప్యాక్డ్ విత్ పవర్ ఫుల్ డైలాగ్స్ అండ్ యాక్షన్ సీన్స్ అన్నట్లుగా వుంది ట్రయిలర్. ట్రయిలర్ ఆరంభంలో పొలిటికల్ గతంలో రాసారా, లేక ఇప్పుడు మార్చి రాసారా ఏమీ కానీ వర్తమాన రాజకీయాలకు టచ్ అయ్యేలాగే వుంది. ఈ సినిమా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. చిట్టూరి శ్రీను నిర్మాత. పవన్ సమర్పకుడు.