జాక్వెలిన్ కు హీరో కూడా గిఫ్ట్ లిచ్చాడ‌ట‌!

రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల స్కామ్ లో సూత్ర‌ధారిగా తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ నుంచి భారీ ఎత్తున గిఫ్ట్ లు పొందిన తార‌గా వార్త‌ల్లో ఉంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. కేవ‌లం ఆమె మాత్ర‌మే…

రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల స్కామ్ లో సూత్ర‌ధారిగా తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ నుంచి భారీ ఎత్తున గిఫ్ట్ లు పొందిన తార‌గా వార్త‌ల్లో ఉంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. కేవ‌లం ఆమె మాత్ర‌మే కాకుండా, త‌న ఇంట్లోని వారికి కూడా సుఖేష్ భారీ ఎత్తున బ‌హుమ‌తులు ఇచ్చాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ‌లో అత‌డు చెప్పాడ‌ట‌.

ఆ సంగ‌త‌లా ఉంటే.. జాక్వెలిన్ కు మంచి మంచి బ‌హుమానాలు ఇచ్చిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడ‌ని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది. స‌ల్మాన్ కూడా ఆమెకు అత్యంత ఖ‌రీదైన బ‌హుమానాలు ఇచ్చాడ‌ట‌.

ఇది వ‌ర‌కే స‌ల్మాన్ తో ప‌ని చేసింది జాక్వెలిన్. అలాగే గ‌ల్ఫ్ కంట్రీస్ కు స‌ల్మాన్ పంపే బాలీవుడ్ ట్రూప్ లో కూడా ఆమె ఉంది. ఆ ట్రూప్ లో భాగంగానే ఆమె ఇండియా దాటి వెళ్లాల‌ని చూస్తే… ఎయిర్ పోర్టు నుంచి వెన‌క్కు పంపారు. ఇలా ఆమె కెరీర్ కు అండ‌గా ఉన్న స‌ల్మాన్ ఆమెకు భారీ గిఫ్ట్ లు ఇచ్చాడ‌ట‌. అందులో ముఖ్యంగా ముంబైలోని ఖ‌రీదైన ఏరియాలో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు, అత్యంత ఖ‌రీదు చేసే ఒక ఔడీ కారు ఉంద‌ట‌. వీటిని త‌న‌తో సినిమాలు చేస్తున్న‌ప్పుడు ఆమెకు బ‌హుమ‌తిగా ఇచ్చాడ‌ట స‌ల్మాన్.

అయితే త‌న స‌హ‌చ‌ర న‌టీన‌టుల‌కు గిఫ్ట్ లు ఇవ్వ‌డం స‌ల్మాన్ కు కొత్త కాదు. స‌ల్మాన్ నుంచి బ‌హుమానాలు పొందిన వారిలో క‌త్రినాకైఫ్. క‌రీనా క‌పూర్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. వారు మాత్ర‌మే కాదు.. క‌న్న‌డ న‌టుడు సుదీప్ కు కూడా స‌ల్మాన్ అతి ఖ‌రీదైన కారును గిఫ్ట్ ఇచ్చాడు. త‌న‌తో సినిమా చేసిన‌ప్పుడు సుదీప్ కు స‌ల్మాన్ ఆ కారును గిఫ్ట్ చేయ‌గా.. ఆ విష‌యాన్ని సుదీప్ కూడా సోష‌ల్ మీడియా పోస్టు చేసి, కారు ఫొటోలు పెట్టి మ‌రీ ధ్రువీక‌రించాడు. స‌ల్మాన్ అభిమానం ఆ రేంజ్ లో ఉంటుంద‌న‌మాట‌!