పెళ్లి తర్వాత అన్నీ అక్కడే అంటున్న చైతూ, సమంత

నాగచైతన్య, సమంత పెళ్లికి డేట్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఆ సంగతి స్వయంగా నాగచైతన్య వెల్లడించాడు. అక్టోబర్ 6న సమంతాను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు. Advertisement అయితే పెళ్లి ఎక్కడ అనే విషయాన్ని…

నాగచైతన్య, సమంత పెళ్లికి డేట్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఆ సంగతి స్వయంగా నాగచైతన్య వెల్లడించాడు. అక్టోబర్ 6న సమంతాను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపాడు.

అయితే పెళ్లి ఎక్కడ అనే విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. అంతా ఊహించినట్టే చైతూ-సమంతల పెళ్లి గోవాలో జరగనుంది. వీళ్లిద్దరూ ఎప్పుడూ రిలాక్స్ అయ్యే రిసార్ట్ లోనే పెళ్లి ఉండబోతోంది.

అక్టోబర్ 6 నుంచి 8వరకు 3రోజుల పాటు సమంత-నాగచైతన్యల పెళ్లి ఉంటుంది. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో వివాహం చేసుకుంటారు. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం న్యూయార్క్ ను ఎంచుకుంది ఈ జంట. న్యూయార్క్ తో పాటు మరికొన్ని దేశాల్లో ఏకంగా 40 రోజుల పాటు విహరించాలని ఫిక్స్ అయింది. 

ఓవరాల్ గా 2 నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నాగచైతన్య, సమంత డిసైడ్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ రెండో వారం నుంచి నవంబర్ చివరి వారం వరకు సినిమాలకు సెలవులు పెట్టేశారు. డిసెంబర్ నుంచి తిరిగి సెట్స్ పైకి వస్తారు.

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగాలని నిర్ణయించింది సమంత. అయితే తనకు నచ్చిన క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేస్తానని ప్రకటించింది.