హీరోయిన్ సమంత క్రమంగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? టాలీవుడ్ లో ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మెలమెల్లగా సినిమాలు తగ్గించుకుని, నటనకు స్వస్తి చెప్పాలని సమంత ఆలోచిస్తున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత కేవలం రెండు సినిమాలకు ఓకె చెప్పారు.. తమిళంలో ఇప్పుడు సమంత ఏ సినిమాకు ఓకె అనలేదు.
తెలుగులో మాత్రం ఒకటి తన భర్త నాగచైతన్యతో కలిసి. రెండవది మహిళా దర్శకురాలు నందినీరెడ్డి డైరక్షన్ లో ఒకటి చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల తరువాత ఇంక సమంత నటిస్తుందా? నటించదా? అంటే కాస్త అనుమానంగానే వుంది.
సమంత ఇంక ఎక్కువగా సినిమాలు చేయకపోవచ్చని, మరీ అద్భుతమైన సినిమా లేదా, పాత్ర వస్తే తప్ప ఈ రెండు సినిమాల తరువాత సమంత ఇక మేకప్ వేసుకోకపోవచ్చని వినిపిస్తోంది.