Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమ్మర్ అంటే సమంత

సమ్మర్ అంటే సమంత

పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గించని సమంత, కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా సమ్మర్ సీజన్ ను అస్సలు వదిలిపెట్టడం లేదు. రంగస్థలం, మహానటి సినిమాలతో గతేడాది సమ్మర్ క్వీన్ అనిపించుకున్న ఈ బ్యూటీ, ఈ ఏడాది సమ్మర్ కు కూడా 2 సినిమాల్ని రెడీ చేసింది.

ఏప్రిల్ 5న మజిలీ రానుంది. సమంత, నాగచైతన్య కలిసి చేసిన సినిమా ఇది. శివ నిర్వాణ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీ తర్వాత తను సోలోగా నటించిన హే బేబీ మూవీని రెడీ చేసింది సమంత. ఇది కూడా వేసవిలోనే విడుదలకాబోతోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఈ సమ్మర్ లో కూడా సమంతదే డామినేషన్.

అటు డబ్బింగ్ సినిమాల సెగ్మెంట్ లో కూడా సమంత హవా నడుస్తోంది. గతేడాది సమ్మర్ లో అభిమన్యుడు సినిమా వచ్చింది. విశాల్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఆ సినిమా తెలుగులో కూడా క్లిక్ అయింది. ఈ ఏడాది సమ్మర్ కు కూడా అలాంటిదే మరో డబ్బింగ్ మూవీ రెడీ చేసింది.

కోలీవుడ్ లో ఆమె నటించిన సూపర్ డీలక్స్ సినిమా ఈ నెలాఖరుకు విడుదలకానుంది. తెలుగులో కూడా ఈ సమ్మర్ లోనే థియేటర్లలోకి వస్తుంది. అది కూడా క్లిక్ అయితే ఈ ఏడాది వేసవిలో కూడా సమంతదే పైచేయిగా నిలుస్తుంది.

టిడిపియే కాదు, వైసిపి కూడా యీ సత్యం గుర్తించాలి

 వైయస్‌ పాలించినది వైసిపి పార్టీ అధినేతగా కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?