నన్ను చంపితే… సినిమా యూట్యూబ్ లోకే అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చారు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. యెదవ పానాలెవడిగ్గావాలి.. సినిమా రాకుండా వుంటే చాలు అన్నట్లుగా, తెలుగుదేశం పార్టీ తెలివిగా సినిమాకు ఎన్నికల కోడ్ కాలు అడ్డంపెట్టింది. ఇప్పుడు సెన్సారు నుంచి సినిమాను బయటకు లాగలేక, వదలలేక కిందామీదా అవుతున్నాడు ఆర్జీవీ.
సినిమా సెన్సారు ప్రాసెస్ నే మొదలుకాలేదు. ఇదంతా తప్పు అంటూ బోలెడు కేసులు, వివరాలు ఏకరవుపెడుతున్నారు ఆర్జీవీ. ఈ విషయంలో తాను కోర్టుకు వెళ్తా అంటున్నారు. ఆర్జీవీ సినిమాలు ఎంటర్ టైన్ చేయకపోయినా, సోషల్ మీడియాలో ఆయన మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ అందిస్తారు.
అందుకే జనాలు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు ఈ విషయాన్ని. తిరిగి రివల్స్ లో, యూట్యూబ్ లో వదిలేయచ్చుగా? సాక్షి చానెల్ కు ఇచ్చేయచ్చుగా అంటూ కౌంటర్ వేస్తున్నారు. ఇప్పడు ఆర్జీవీ కోర్టు ఫైట్ స్టార్ట్ చేసి, అన్నీ పూర్తి చేసుకుని, సినిమా విడుదలకు రెడీ అయ్యేసరికి ఎన్నికల పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుంది. ఇక సినిమా వుంచుకున్నా, వదులుకున్నా ఒకటే.