సమంత కావాలనే ఎగ్గొట్టిందా?

జనతా గ్యారేజ్ అడియో ఫంక్షన్ కు హీరోయిన్ సమంత హాజరు కాలేదు. ఒంట్లో సరిగ్గాలేదని అందుకే రాలేదని ఓ రీజన్ అయితే వినిపించింది. సాధారణంగా సమంత ఇలాంటి ఫంక్షన్ లను అస్సలు అవాయిడ్ చేయదు.…

జనతా గ్యారేజ్ అడియో ఫంక్షన్ కు హీరోయిన్ సమంత హాజరు కాలేదు. ఒంట్లో సరిగ్గాలేదని అందుకే రాలేదని ఓ రీజన్ అయితే వినిపించింది. సాధారణంగా సమంత ఇలాంటి ఫంక్షన్ లను అస్సలు అవాయిడ్ చేయదు. పైగా స్పెషల్ గా డ్రెస్ చేసుకుమరీ వస్తుంది. 

అలాంటిది సమంత రాలేదంటే కచ్చితంగా  ఆ రీజన్ కరెక్ట్ అయి వుంటుందనే అనుకున్నారంతా. కానీ గమ్మత్తుగా అడియో ఫంక్షన్ జరిగిన మర్నాడే అంటే 13న బెంగుళూరు మార్తహళ్లి లోని ఓ కేఫ్ ఓపెనింగ్ కు సమంత చీఫ్ గెస్ట్ గా హాజరయిందట. దీంతో సమంత గైర్హాజరుపై డవుట్ లు వ్యక్తం అవుతున్నాయి. 

ముఖ్యమైన కీలకమైన సినిమా అడియో ఫంక్షన్ వదిలేసి, మర్నాడు ఓ కమర్షియల్ ప్రొగ్రామ్ కు హాజరు కావడాన్ని ఎన్టీఆర్ అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. మరి సమంత ఇలా ఎందుకు చేసినట్లో?