సమంత మళ్లీ మరోస్సారి

తమిళ నాట హిట్ హీరోయిన్ అనిపించుకోవడానికి సమంత పడుతున్న పాట్లు ఇన్నీ అన్నీ కావు. సూర్య, విజయ్ ఇలా అందరి పక్కన ట్రయ్ చేస్తోంది. కానీ సరైన ఫలితం దక్కడంలేదు. అయినా పట్టువదలడం లేదు.…

తమిళ నాట హిట్ హీరోయిన్ అనిపించుకోవడానికి సమంత పడుతున్న పాట్లు ఇన్నీ అన్నీ కావు. సూర్య, విజయ్ ఇలా అందరి పక్కన ట్రయ్ చేస్తోంది. కానీ సరైన ఫలితం దక్కడంలేదు. అయినా పట్టువదలడం లేదు. ఇప్పుడు మొత్తానికి మరో చాన్స్ పట్టేసింది. రజనీ అల్లుడు ధనుష్ సరసన నటించేందుకు ఓకె అంది. 

ఇటీవలే ధనుష్ తో విఐపి సినిమా తీసిన వేల్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా వుంటుంది. అయితే ఇక్కడ సమంతకు చిన్న బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, ఇది సోలో హీరోయిన్ వ్యవహారం కాదు. పక్కన మదరాసుపట్టణం, ఐ  సినిమాల చిన్నది ఎమీ జాక్సన్ కూడా వుంటుంది. ఆమెతో పోటీపడి శభాష్ అనిపించుకోవాలి. 

కానీ సమంత ఇలా మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నపుడల్లా మైనస్ అవుతోంది. ఈ సారేమవుతుందో?