ఇంకో హిట్‌ కొట్టేస్తాడా?

లౌక్యం’తో తన పరాజయాల పరంపరకి బ్రేక్‌ వేసిన గోపీచంద్‌ ఇదే ఊపులో ఇంకో హిట్‌ కొట్టాలని తహతహలాడుతున్నాడు. వరుసపెట్టి వేధించిన పరాజయాల్ని మరిపించాలంటే ఇప్పుడు తనకి హిట్లు కూడా క్యూ కట్టాల్సిందే మరి. ‘లౌక్యం’పై…

లౌక్యం’తో తన పరాజయాల పరంపరకి బ్రేక్‌ వేసిన గోపీచంద్‌ ఇదే ఊపులో ఇంకో హిట్‌ కొట్టాలని తహతహలాడుతున్నాడు. వరుసపెట్టి వేధించిన పరాజయాల్ని మరిపించాలంటే ఇప్పుడు తనకి హిట్లు కూడా క్యూ కట్టాల్సిందే మరి. ‘లౌక్యం’పై ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్‌ అయినా ఈ ఏడాదిలో వచ్చిన అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. 

గోపీచంద్‌ మలి చిత్రం కూడా వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ డైరెక్ట్‌ చేస్తోన్న ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ‘మిర్చి’, ‘రన్‌ రాజా రన్‌’ లాంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ దీంతో హ్యాట్రిక్‌ పూర్తి చేస్తుందేమో చూడాలి. 

గోపీచంద్‌ సరసన ‘ఊహలు గుసగుసలాడే’ ఫేమ్‌ రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనరేనట. గోపీచంద్‌ని ఇంతవరకు ఏ సినిమాలోను చూపించనంత స్టయిలిష్‌గా కొత్త దర్శకుడు చూపిస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది.