ఇండోనేషియా లోని జాకార్త నుంచి సింగపూర్ బయలుదేరిన విమానం అంతర్థానం అయ్యింది. 161 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం ఆదివారం ఉదయం జాకార్తలో లో లేకాఫ్ అయ్యింది. చివరి సరిగా జాకార్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఉదయం 7.24 అప్పుడు విమానం కమ్యూనికేట్ అయ్యింది. ఆ తర్వాత దీని జాడ కనపడటం లేదని సింగపూర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది.
దీంతో ఈ విమానం ఏమైందో అర్థం కాని పరిస్థితినెలకొంది. దీని గురించి శోధన జరుగుతోంది. ఈ విమానం లో భారతీయ ప్రయాణికులు ఎవరూ లేరని సింగపూర్ ఏవియేషన్ అథారిటీ పేర్కొనడం కొంత వరకూ ఊరట.
అయితే ఏకంగా 161 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం ఎటు వెళ్లిందనేది మాత్రం ఆందోళనకరమైన విషయం. ప్రయాణికుల పరిస్థితి పై వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజు క్రితం కూడా ఇలాగే మిస్ అయిన మలేషియా విమానాన్ని ఎవరూ మరిచిపోలేదు. అది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకూ తెలియలేదు. ఈ నేపథ్యంలో ఎయిరేషియా విమానం మాయం ఆందోళన కలిగిస్తోంది. దీని ఆచూకీని తెలుసుకొనే చర్యలు అయితే ఊపందుకొన్నాయని తెలుస్తోంది.