Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత-విజయ్ లను వాడేస్తున్నారు

సమంత-విజయ్ లను వాడేస్తున్నారు

మహానటి సినిమా అనగానే జనాలకు తెలుసు సావిత్రి బ్రయోపిక్ అని. కానీ నిర్మాతల రూట్ వేరుగా కనిపిస్తోంది. సమంతను, విజయ్ దేవరకొండను ఎక్కువగా వాడుకుని, సినిమాకు కమర్షియల్ లుక్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి క్రేజ్ వుండనే వుంది. అలాగే సమంత రంగస్థలం హిట్ మీద వుంది.

అందుకే తరచు ఆ ఇద్దరి ఫోటోలు తెగ వాడుతున్నారు. అలాగే ఇదేదో ఆ ఇద్దరి మధ్య లవ్ స్టోరీ అన్న లుక్ తీసుకువస్తున్నట్లు కనిపిస్తుంది. కేవలం సావిత్రి బయోపిక్ అంటే రెగ్యులర్ సినిమా జనాలకు పెద్దగా ఆసక్తి వుండకపోవచ్చు.

అలా కాకుండా ఓ పక్క సమంత-విజయ్ దేవరకొండల లవ్ స్టోరీ రన్ అవుతూ, సావిత్రి బయోపిక్ అంటే ఆ ఇంట్రస్ట్ వేరుగా వుంటుంది. ఇప్పటి వరకు వదిలింది కేవలం సావిత్రి లుక్ మాత్రమే. ఆ తరువాత ఎక్కువగా కనిపిస్తున్నది సమంత-విజయ్ దేవర కొండ స్టిల్స్.

సినిమా విడుదల ఇంకా పది పన్నెండు రోజుల దూరంలో వుంది. మరి సినిమాలో మిగిలిన వారి లుక్ లు ఎప్పుడు బయటకు వస్తాయో? లేక 1న విడుదలయ్యే ట్రయిలర్ లోనే అన్నీ వుంటాయో? చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?