సమంత-చైతన్య- ఇదే హాట్ టాపిక్

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమైనా వుందీ అంటే అది సమంత – చైతన్య జోడీ మీదే. ఏ క్షణాన సమంత తన ట్విట్టర్ అక్కౌంట్ లో పేరు నుంచి అక్కినేని అన్న…

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమైనా వుందీ అంటే అది సమంత – చైతన్య జోడీ మీదే. ఏ క్షణాన సమంత తన ట్విట్టర్ అక్కౌంట్ లో పేరు నుంచి అక్కినేని అన్న పదం తీసేసి, కేవలం 'ఎస్' అన్న పదం వుంచిందో అప్పటి నుంచి ఒకటే క్యూరియాసిటీ. ఏమై వుంటుంది? ఏమవుతోంది? ఏం జరిగిందని?

ఏమాయె చేసావె సినిమా నుంచి మొదలైన చైతూ-సమంతల ప్రేమ పెళ్లి వరకు వచ్చింది. ఆ తరువాత కూడా చాలా అన్యోన్యంగా సాగుతూంది. ఆ మధ్య చైతన్యను ఆహా కోసం సమంత ఇంటర్వ్యూ చేసింది. అలాగే బిగ్ బాస్ కు నాగ్ రాలేకపోతే సమంత హోస్ట్ చేసింది. రానా పెళ్లిలో సందడంతా సమంత దే. అంతలా అల్లుకు పోయింది సమంత తన అత్తింటి వైపు కుటుంబంలో.

అలాంటిది ఇప్పుడు ఎందుకిలా?  అన్నదే క్యూరియాసిటీ . పోనీ సమంత అయినా క్లారిటీగా కట్ చేసిందా? అంటే అదీ లేదు. ఏ పేరు పెట్టుకోవాలో తన ఇష్టం అన్నట్లు, ఏదైనా ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతాను కానీ, ఎవరి కోసమో చెప్పను అన్నట్లు రకరకాల అర్థం వచ్చేలా సమాధానాలు చెప్పింది. పైగా తను, తన ఫ్యాన్స్ బేస్ అంతా వేరు అన్నట్లు మాట్లాడింది. ఇవన్నీ టాలీవుడ్ జనాల డిస్కషన్ కు మంచి పాయింట్ లు గా మారాయి.

టాలీవుడ్ లో హైఫై లేడీస్ కిట్టీ పార్టీల్లో కూడా సమంత-చైతూల వ్యవహారం డిస్కషన్ పాయింట్ గా వుందని టాక్. అది ఎంత వరకు వెళ్లింది అంటే నాగ్-అమల స్వయంగా రంగంలోకి దిగి చైతూ-సమంత లకు క్లాస్ పీకారని కూడా వినిపించేవరకు. ఒకటి రెండు రోజుల క్రితం ఓ దర్శకుడు చైతన్యకు ఏదో విషయమై ఫోన్ చేస్తే, తన టెన్షన్ లు తనకు వున్నాయని, తరువాత చెప్తా అని బదులు ఇచ్చారని మరో గ్యాసిప్ వినిపిస్తోంది. 

మొత్తం మీద సమంత-చైతన్య ల మధ్య ఏం జరుగుతోందో అన్న పాయింట్ టాలీవుడ్ లో చాలా మంది మధ్య హాట్ టాపిక్ గా మారుతోంది.