సంపత్ నంది తన కెరీర్ స్టార్ట్ చేసిందే లవ్ అండ్ రొమాంటిక్ మూవీతో. ఆ తరువాత పుల్ మాస్ మాసాలా మూవీలతో రచ్చచేసినా, ఒరిజినల్ లోపల అలాగే వున్నట్లుంది. అందుకే అప్పుడప్పుడు గాలిపటాలు, పేపర్ బాయ్ లు ట్రయ్ చేస్తుంటారు. గౌతమ్ నందా నిరాశ పర్చిన తరువాత మళ్లీ రిలీఫ్ కోసం అన్నట్లు తన స్టయిల్ లో ఓ సినిమాకు కథ, మాటలు, నిర్మాణ సహకారం అందిస్తున్నాడు. అదే పేపర్ బాయ్.
సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. సంపత్ నందికి సినిమా రిచ్ గా వుండకపోతే తోచదు. కలర్ ఫుల్ గా వుండకపోతే నచ్చదు. అందుకే చిన్న సినిమా, చిన్న నటులు అయినా పేపర్ బాయ్ ట్రయిలర్ కూడా రిచ్ గా వుంది. లోకేషన్లు కలర్ ఫుల్ గా వున్నాయి. అందువల్ల ట్రయిలర్ ఆకట్టుకునేలాగే వుంది.
కానీ కాకపోతే ఒకటే సమస్య. కథ మళ్లీ పేద, ధనిక వర్గాల మధ్య పుట్టే ప్రేమ, కిందామీదా అయ్యే ప్రేమ..అదే సబ్జెక్ట్. మరి సంపత్ నంది కొత్తగా ఏం చెబుతాడో.. ఏం చూపిస్తాడో చూడాలి.