Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంపూర్ణేష్ కాదు అవసరాల

సంపూర్ణేష్ కాదు అవసరాల

డైరక్టర్ క్రిష్ ఆయన స్నేహితుడు రాజీవ్ రెడ్డి కలిసి సినిమాలు నిర్మిస్తుంటారన్న సంగతి తెలిసిందే. మంచి మంచి సినిమాలు చేస్తుంటారు. కానీ హుషారుకు, ఆసక్తి కి బ్రేక్ వేసింది ఇటీవల వచ్చిన అంతరిక్షం సినిమా. సంకల్ప్ రెడ్డికి అవకాశం ఇచ్చి తీసిన ఆ సినిమా ఆర్థికంగా కాస్త గట్టి దెబ్బే తీసింది.

దీంతో మళ్లీ వెంటనే సినిమా నిర్మాణం చేపట్టలేకపోయారు. ఇప్పడు ఓ చిన్న సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆ మధ్య ఓ స్కీము అనౌన్స్ చేసారు. బౌండ్ స్క్రిప్ట్ తో వస్తే, తాను ఫండింగ్ చేస్తానని, సినిమా తీసి ఇస్తే, మార్కెటింగ్ చేస్తానని చెప్పారు.

ఇప్పుడు ఆ స్కీములో క్రిష్-రాజీవ్ రెడ్డి కలిసి సినిమా నిర్మాణం స్టార్ట్ చేసారు. వాస్తవానికి వారు ఆ మధ్య ఓ చిన్న కామెడీ సినిమాను సంపూర్ణేష్ బాబుతో తీసే ఆలోచనలో వున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఏమయిందో మళ్లీ ఆ ప్రాజెక్టు డ్రాప్ అయింది.

లేటెస్ట్ గా దిల్ రాజు పార్టనర్ షిప్ లో చేస్తున్న సినిమాకు అవసరాల శ్రీనివాస్ హీరో కావడం, ఆ సినిమా కూడా కామెడీ సినిమా అని వినిపిస్తోంది. దీంతో సంపూ చేయాల్సిన సినిమానే అవసరాలకు మార్చారని టాక్ వినిపిస్తోంది. మార్కెట్ పరంగా, క్రిష్-రాజీవ్ రెడ్డి-దిల్ రాజు లాంటి పేర్లకు అవసరాల పేరు తోడయితే కాస్త బాగానే వుండే అవకాశం వుంది.

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?