హృదయకాలేయం సినిమాతో సర్రున దూసుకు వచ్చాడు సంపూర్ణేష్ బాబు. తరువాత సింగం 123 సినిమా చేసాడు. ఈ రెండు తప్పిస్తే, మళ్లీ మరో ఫుల్ లెంగ్త్ రోల్ సినిమా చేయలేదు ఇంతవరకు. డైరక్టర్ మారుతి నిర్మాణంలో ఓ సినిమా తలపెట్టారు ఎప్పుడో లాంగ్ బ్యాక్. అంతలో ఆయనకు భలే భలే లాంటి భయంకరమైన హిట్ వచ్చింది. ఫుల్ బిజీ అయిపోయారు.
ఈ సినిమా పక్కన పెట్టారో తెలియదు. మరేం చేసారో తెలియదు. ఇక హృదయకాలేయం టీమ్ కొబ్బరి మట్ట అనే తరువాతి సినిమాను అప్పుడే ప్రకటించింది. అప్పటి నుంచి చెక్కడం ఫ్రారంభించింది. కానీ ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తి కావాలి. అది జనానికి నచ్చాలి. అప్పుడు మళ్లీ సంపూ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ కావాలి.
గ్రౌండ్ లెవెల్ కామెడీ సినిమాకు పక్కాగా సరిపోతాడు సంపూ. కానీ ఎందుకో ప్రాజెక్టులు అలా నత్తనడక నడుస్తున్నాయి.